వానలో ఇబ్బందిపడుతూ కారు దిగిన హీరోయిన్ని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.. ఎందుకని?

అవును. మీరు విన్నది నిజమే. వానలో ఇబ్బందిపడుతూ కారు దిగిన ఓ హీరోయిన్ని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు మన నెట్టింట్లో జనాలు. ఇంతకీ ఆమె ఎవరని అనుకుంటున్నారా? అదే మన యంగ్ బ్యూటీ కియారా అద్వాని. ఈమె ఓ వైపు బాలీవుడ్లో చేస్తూనే తెలుగులో కూడా అడపాదడపా నటిస్తూ మంచి బిజీగా ఉంటోంది. ఆమెకి కాస్త సమయం చిక్కినప్పుడల్లా సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తూ.. కుర్రాళ్ల హృదయాలను కొల్లకొడుతోంది. టాలీవుడ్ , బాలీవుడ్ యంగ్ బ్యూటీస్ లో కియారా అద్వానీ స్పెషల్ క్రేజ్ ఉంది. ఇటు తెలుగులో అటు బాలీవుడ్ లో వరుస ఆఫర్లతో ఆమె దూసుకుపోతోంది.

తాజాగా ఈ ముద్దుగుమ్మ నెటిజన్ల నుంచి ధారుణమైన ట్రోలింగ్ ను ఫేస్ చేస్తోంది. ఓ సినిమా షూటింగ్ కోసమని వెళ్తూ ముంబైలో ఆమె కారులో నుంచి కిందకు దిగింది. అయితే షూటింగ్ స్పాట్ కు ఆమె వెళ్తోన్న టైమ్ లో.. వర్షం పడుతుండటంతో… ఆమె తడవకుండా ఈమె సెక్యూరిటీ సిబ్బంది, బాడీ గార్డ్ గొడుగు పట్టుకున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోనే కియారాపై నెటిజన్ల కోపానికి కారణం అయ్యింది. అయితే ఇందులో తప్పేముంది అని అనుకుంటున్నారా?

మరేమి లేదండి… ఆ సిట్యుయేషన్ లో ఆమె తన గొడుగుని పట్టుకోడానికి ఇతరులను నియమించింది కదా. అందుకే మనవాళ్లకు పూనకాలు వచ్చేసాయి. దాంతో నెటిజన్లు ఆమెపై విరుచుకు పడుతున్నారు. గొడుగు పట్టుకోవడం కూడా చేతకావడంలేదా..? అని ఒకరంటే, నీకు చేతులు లేవా? అని కొందరు సోషల్ మీడియా జనాలు మందడిపడుతున్నారు. ఆమెకు చేతుల్లేవేమో, అందుకే గొడుగు కూడా పట్టుకోలేక పోతోంది అంటూ కొందరు వాటికీ రిప్లయ్ ఇస్తున్నారు. సెక్యూరిట గార్ట్ లు ఏమైపోయినా పర్లేదా..? వాళ్ళు తడుస్తూ..నీకు గొడుగు పట్టుకోవాలా అంటూ.. సెటైర్లు వేస్తున్నారు.

Share post:

Latest