వామ్మో..ఈ హీరోల ఒకరోజు సంపాదన ఇంతనా?

ప్రపంచంలోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమాలను తీస్తున్న చిత్ర పరిశ్రమ బాలీవుడ్.. సినిమా అనేది వినోదాన్ని అందించే ప్రాథమిక వనరులలో ఒకటి కాబట్టి పెద్ద మొత్తంలో వసూళ్లు సాధిస్తాయి. బాలీవుడ్ లో పోటీ కూడా ఎక్కువే.. పోటీని తట్టుకోవడం అంత ఈజీ కాదు. యాక్టింగ్, ఎవరూ చూపించని స్టయిల్, స్టోరీ ఎంపిక ఆ సినిమా హిట్ కావడానికి ప్రధానమైనవి.. వీటన్నింటినీ తట్టుకుంటూ ఎక్కువ కాలం నిలబడిన హీరోలు చాలా తక్కువ మంది ఉన్నారు. అంతటి స్టార్ డమ్ తెచ్చుకున్న హీరోల సంపాదన కూడా భారీగానే ఉంటుంది.. మరీ బాలీవుడ్ హీరోల సంపాదన ఎంతో ఇప్పుడు తెలుసుకుందాం..

అమితాబ్ బచ్చన్ :
బాలీవుడ్ లో పోటీని తట్టుకుని ఎక్కువ కాలం నిలబడిన హీరోగా అమితాబ్ ముందుంటారు.. ఎన్ని తరాల హీరోలు ఇండస్ట్రీకి వచ్చినా.. అమితాబ్ స్థానాన్ని కదిలించలేకపోయారు. అమితాబ్ బచ్చన్ నాలుగు జాతీయ చలన చిత్ర అవార్డులు, 15 ఫిల్మ్ ఫేర్ అవార్డులతో సహా అనేక అవార్డులను గెలుచుకున్నాడు. అయితే అమితాబ్ బచ్చన్ అనే కార్పొరేషన్ అనే సంస్థను ఏర్పాటు చేసి ఆయన భారీగా నష్టపోయారు. ఆ తర్వాత ‘కౌన్ బనేగా కరోడ పతి’ షోకు హోస్ట్ గా వ్యవహరించి మళ్లీ పుంజుకున్నారు. ఆయన రోజుకు 1.2 కోట్ల రూపాయలు సంపాదిస్తారని టాక్ ఉంది. ఆయన ఆస్తుల విలువ 3995 కోట్లు ఉంటుందని సమాచారం..

సల్మాన్ ఖాన్:
ఇక అమితాబ్ తర్వాత బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఉంటారు. సల్మాన్ ఖాన్ కి ఎంత క్రేజ్ ఉందంటే.. ఆయన నటించిన ఫ్లాప్ సినిమా కూడా రూ.100 కోట్లు వసూలు చేస్తుంది.. ‘బీయింగ్ హ్యూమన్’ అనే పేరుతో ఆయనకు సొంత బ్రాండ్ కూడా ఉంది. ఇక పన్వేల్ ప్రాంతంలో 100 ఎకరాల్లో ఫామ్ హౌస్ ఉంది. ఆయన రోజుకు రూ.కోటి సంపాదిస్తారు. సల్మాన్ ఖాన్ ఆస్తి విలువ 2875 కోట్లు ఉంటుందని అంచనా..

షారుఖ్ ఖాన్:
షారుక్ ఖాన్ కి రెడ్ చిల్లీస్ అనే నిర్మాణ సంస్థ, విజువల్ ఎఫెక్ట్స్ కి సంబంధించిన సంస్థలు ఉన్నాయి. ఆయన కోల్ కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీకి యజమాని. అలా ఆయన రోజుకు రూ.1.40 కోట్లు సంపాదిస్తారట.. ఆయన ఆస్తుల విలువ 5593 కోట్ల రూపాయలు ఉండొచ్చని అంచనా..

అమిర్ ఖాన్:
అమిర్ ఖాన్ రోజుకు రూ.33.50 లక్షలు సంపాదిస్తారు. ఆయన ఆస్తుల విలువ 1800 కోట్ల వరకు ఉంటుందని టాక్..

అక్షయ్ కుమార్:
అక్షయ్ కుమార్ ఎప్పుడూ సినిమాలతో బిజిగా ఉంటారు. ఏడాదికి కనీసం మూడు సినిమాలు చేస్తారు. ఆయన రోజుకు రూ.కోటి సంపాదిస్తారు. ఆయన ఆస్తుల విలువ 2596 కోట్లు ఉంటుందని చెబుతారు..