బాలీవుడ్లో దుమ్ములేపిన టాప్ 10 సౌత్ సినిమాలు ఇవే… కలెక్షన్లు చూస్తే బెదిరిపోతారు!

ఇండియన్ సినిమా అంటే కేవలం బాలీవుడ్ అనే మాట ఇప్పుడు మాయం అయిపోయింది. అవును… గత కొన్నాళ్లుగా సౌత్ సినిమాలు బాలీవుడ్లో కూడా దుమ్ములేపుతున్నాయి. ముఖ్యంగా ఈ పరిణామం బాహుబలితో స్టార్ట్ అయిందని చెప్పుకోవాలి. అవును… జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి అనే సినిమా రెండు పార్టులు కూడా నార్త్ లో దుమ్ము లేపాయి. దాంతో బాలీవుడ్ ఒక్కసారిగా టాలీవుడ్ వైపు చూడటం మొదలు పెట్టింది. ఆ తరువాత కన్నడ నుండి వచ్చిన సినిమా KGF ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో చెప్పాల్సిన పనిలేదు.

అలా సౌత్ సినిమాలకు నంది పలికింది మాత్రం రాజమౌళి బాహుబలినే. ఆ తరువాత ఆ పరంపర అలా కొనసాగుతూ వస్తోంది. అయితే ఈ క్రమంలో వచ్చిన టాప్ 10 సినిమాల గురించి ఇపుడు మాట్లాడుకుందాం. ఆ తరువాతి వరుసలో RRR ఉంటుంది. బాలీవుడ్‌లో ఈ సినిమా అత్యధిక కలెక్షన్లు కొల్లగొట్టింది. అది మరిచిపోకముందే.. 20 రోజుల గ్యాప్‌తో విడుదలైన యశ్, ప్రశాంత్ నీల్‌ల కేజీఎఫ్ 2 ఇపుడు బాలీవుడ్ ట్రేడ్ పండితులును సైతం ఆశ్యర్యపోయే వసూళ్లను రాబట్టింది. తాజాగా నిఖిల్ హీరోగా నటించిన కార్తికేయ 2 మూవీ బాలీవుడ్‌లో సౌత్ డబ్బింగ్ మూవీల్లో టాప్ 10లో చేరింది.

బాహుబలి సినిమా ఎటువంటి కలెక్షన్ల సునామి సృష్టించిందో చెప్పాల్సిన పనిలేదు. అలాగే యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కెజియఫ్ సినిమా నార్త్ సౌత్ అంటూ తేడా లేకుండా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈ సినిమా మొత్తంగా ఇప్పటి వరకు రూ. 435.2 కోట్ల నెట్ కలెక్షన్స్‌ను రాబట్టింది. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన RRR సినిమా రూ. 276.8 కోట్ల నెట్ కలెక్షన్స్‌తో సౌత్ డబ్బింగ్ సినిమాల్లో మూడో స్థానంలో ఉంది. రజినీకాంత్, శంకర్ కాంబినేషన్, అక్షయ్ కుమార్ కాంబినేషన్లో వచ్చిన రోబో సినిమా ఓవరాల్‌గా ఈ సినిమా రూ. 189 కోట్ల నెట్ వసూళ్లు సాధించి నాల్గవ స్థానంలో వుంది. ఇక తాజాగా వచ్చిన కార్తికేయ 2 సినిమా కూడా టాప్ టెన్ లో ఉండటం హర్షణీయం.

Share post:

Latest