మన స్టార్ హీరోలు ఇష్టంగా తినే ఆహారం ఇదే.. వారి బ్యూటీ సీక్రెట్ ఇదేనా?

సాధారణ మానవులు తినే తిండికి, గ్లామర్ ప్రపంచానికి చెందిన మనుషులు తినే తిండికి కాస్త వ్యత్యాసం ఉంటుంది. మనం ఆకలేస్తే దొరికింది తినేస్తూ ఉంటాము. వారు అలా కాదు.. తినే తిండి విషయంలో అనేక నియమాలు పాటిస్తూ వుంటారు. లేకపోతే వారి శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. కోట్లు గడిచినా కూడా వారు కడుపు నిండా తినలేరు. తింటే లావు అయిపోతారు. అందుకే తమకు యిష్టమైన ఫుడ్స్ ఊరిస్తున్నా కూడా వారు కడుపు కట్టుకుని ఉంటారు. మరికొందరు మాత్రం బాగా తినేసి ఆ తర్వాత కొవ్వు కరిగించే పనిలో జిమ్‌లో కుస్తీలు పడుతుంటారు. మొత్తానికి ఎలా చేసినా కూడా మన స్టార్స్‌కు కూడా కొన్ని ఫేవరేట్ ఫుడ్స్ ఉంటాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

ముఖ్యంగా సీ ఫుడ్ ని మనవాళ్ళు బాగా ఇష్టపడతారు. ముందుగా మెగాస్టార్ చిరంజీవిని తీసుకుంటే చేపల పులుసు, రొయ్యల వేపుడుని ఇష్టంగా తింటారు. అలాగే దోశలు కూడా బాగా తింటాడు చిరంజీవి. ఇక మన బాలయ్యకు చికెన్ బిర్యానీ అంటే మహా యిష్టం. అలాగే రొయ్యల వేపుడిని కూడా యిష్టంగా తింటాడు. తమిళ తంబీల ఆరాధ్యుడు సూపర్ స్టార్ రజినీకాంత్ చికెన్ లేదంటే మటన్ కర్రీ అంటే చాలా ఇష్టమట. ఈ రెండూ ఉంటే చాలా యిష్టంగా డైట్ కూడా మరిచిపోయి లాగిస్తుంటాడు సూపర్ స్టార్.

ఇక ఆంధ్రుల ఆరాధ్యుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బాగా యిష్టంగా తినే ఫుడ్ నెల్లూరి చేపల పులుసు, నాటుకోడి పులుసు. కూరగాయల విషయానికొస్తే… అరటికాయ్ వేపుడు, పప్పు, లెమన్ రైస్.. ఇవన్నీ ఉంటే పవన్ ఇంకేం అడగడు. మరి తెలుగు అమ్మాయిల ఫేవరేట్ మహేష్ బాబుకు ఇష్టమైన ఫుడ్ ఏమంటే, బిర్యానీ, చేపల పులుసు. అవును… వాటిని బాగా హ్యాపీగా లాగిస్తుంటాడు సూపర్ స్టార్. డైటీషియన్ సలహా తీసుకుని మరీ ఫుడ్ తీసుకుంటాడు ఈయన. అలాగే విక్టరీ హీరోకు నాన్న రామానాయుడు తయారు చేసిన నోస్టాలజిక్ కీమా అంటే ప్రాణం. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఆ కీమాతో కలిపి తింటే స్వర్గం అంటాడు దగ్గుబాటి వారసుడు.

Share post:

Latest