నాడు జయసుధ.. నేడు కీర్తి సురేష్.. జీవితాలనే మార్చిన ప్రముఖ హీరోయిన్..!!

ప్రముఖ దర్శక రత్న దాసరి నారాయణరావు గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా ఈయన తీసిన లేడీ ఓరియంటెడ్ సినిమా అయినా.. ఒక అగ్ర హీరో తో కమర్షియల్ బ్లాక్ బాస్టర్ అయినా అది ఆయనకు మాత్రమే సాధ్యమవుతుంది. ముఖ్యంగా అలా 1978లో ఎన్టీఆర్ , ఏఎన్నార్లు అంటే అగ్ర హీరోలు లేకుండా కేవలం చిన్న ఆర్టిస్టులతోనే తీసిన చిత్రం శివరంజని. ఇక ఈ సినిమా జయసుధ కెరియర్ లోనే ఒక మంచి ఆణిముత్యముగా మారిపోయిందని చెప్పవచ్చు. ఈ సినిమాలో సావిత్రి గారి జీవితంలో జరిగిన కొన్ని సంఘటన ఆధారంగా తీసుకొని దాసరి ఆమె ను ఆస్థానంలో పెట్టి సినిమాను తెరకెక్కించారు..The Legend and the Legacy of Dasari Narayana Rao

నిజానికి సావిత్రితో దాసరి నారాయణరావుకు మంచి అనుబంధం ఉండేది. ఇక సావిత్రి దాసరిని తమ్ముడు అంటూ ఎంతో ఆప్యాయంగా పిలిచేవారు. సమయం దొరికినప్పుడల్లా సావిత్రి.. ఆమె జీవితంలోని ఎన్నో సంఘటనలు దాసరితో చెప్పేవారట. ఇక అలా ఆమె జీవితంలోని సంఘటనలను ఆధారంగా తీసుకొని శివరంజని సినిమా కథను సిద్ధం చేశారు దాసరి. ఇక మెయిన్ లీడ్ గా జయసుధను ఎంపిక చేశారు. ఇక ఆమె అభిమానిగా నటించే పాత్రలో మొదటి చిరంజీవిని అనుకున్నా.. కొన్ని కారణాలవల్ల చిరంజీవి తప్పుకోవడం జరిగింది. ఇక ఆయన స్నేహితులు అప్పట్లో రూమ్ మేట్ అయిన హరిప్రసాద్ కు అవకాశం లభించింది.

ఇక ఒక గ్రామం నుండి వచ్చే అగ్ర హీరోయిన్ అయిన శివరంజనికి అభిమానిగా ఆమెను ఆరాధించే వ్యక్తి.. అభిమానం నచ్చి పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది.. కానీ పరిస్థితులకు తల ఒగ్గి వివాహాన్ని వద్దనుకోవడమే సినిమా కథ.. ఇక ఈ సినిమా అప్పట్లో మంచి విజయాన్ని సొంతం చేసుకుందని చెప్పవచ్చు. ఇక సావిత్రి కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా జయసుధ జీవితాన్ని మార్చేసిందని చెప్పవచ్చు. Drama in real lifeఇదే సావిత్రి గారి జీవిత కథతో తెరకెక్కిన మహానటి లో కీర్తి సురేష్ నటించగా..ఆమె కెరియర్ కూడా మారిపోయిందని చెప్పాలి . ఇలా ఇద్దరూ హీరోయిన్లకు జీవితాన్ని ఇచ్చారు సావిత్రి.