ఎన్టీఆర్ సింహాద్రి, బాల‌య్య చెన్న‌కేశ‌వ‌రెడ్డికి ఉన్న సంబంధం ఇదే…!

ప్ర‌స్తుతం టాలీవుడ్‌ అగ్ర హీరోల్లో ఒకరిగా కొనసాగుతున్న జూనియర్ ఎన్టీఆర్ తన నటన, డాన్సులతో తాతకు తగ్గ మనవడుగా తనకు తిరుగులేదని నిరూపిస్తున్నారు. ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరోగా ఎదుగుతున్న సమయంలో ఎన్టీఆర్ గురించి చిన్న ఇంట్ర‌స్టింగ్ అప్‌డేట్ కూడా బాగా వైర‌ల్ అవుతోంది.
కెరియర్ మొదట్లో ఆయన మాస్ హీరోగా నిలబెట్టిన సినిమా ఏదంటే అది సింహాద్రి. ఈ సినిమాకు రాజమౌళి దర్శకుడు. కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్. సింహాద్రి సినిమాలో భూమిక , అంకిత హీరోయిన్లుగా నటించారు. ఆ సినిమా రాజమౌళి కి రెండో సినిమా గా వచ్చింది.

అప్ప‌ట్లో రాజమౌళి – ఎన్టీఆర్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా నిర్మాత‌కు లాభాల‌ పంట పండించింది. ఇప్పుడు కూడా సింహాద్రి టీవీలో వస్తుంది అంటే ప్రేక్షకులు తల తిప్పకుండా చూస్తూ ఉంటారు. రాజమౌళిని మాస్, కమర్షియల్ డైరెక్టర్గా నిలబెట్టింది సింహాద్రి సినిమానే. ఇక అదే సమయంలో నట‌సింహ నందమూరి బాలకృష్ణ నటించిన చెన్నకేశవరెడ్డి సినిమా కూడా సింహాద్రికి ఆరేడు నెల‌ల ముందు రిలీజ్ అయ్యింది.

చెన్న‌కేశ‌వ‌రెడ్డి, ఎన్టీఆర్ సింహాద్రి సినిమాకు ఓ లింక్ ఉంద‌న్న విష‌యం త‌క్కువ మందికి తెలుసు. బాలయ్య సినిమాకు వినాయక్‌ దర్శకత్వం వహించగా, ఎన్టీఆర్ సినిమాకు రాజమౌళి దర్శకత్వం వహించారు. బాలయ్య చెన్నకేశవరెడ్డి సినిమాని ముందుగా వి. సముద్ర దర్శకత్వంలో తెరకెక్కించాలని అనుకున్నారట. అదే టైంలో ఆది సినిమా రిలీజ్ అయి ఇండస్ట్రీ రికార్డులన్నీ బద్దలు కొట్టింది. అప్పుడు నిర్మాత బెల్లంకొండ సురేష్ తమ నిర్ణయాన్ని మార్చుకొని చెన్నకేశవరెడ్డి సినిమాని వినాయక్ తోనే డైరెక్ట్ చేయించాలని అనుకున్నారట.

అలా చెన్నకేశవరెడ్డి దర్శకత్వ బాధితులు వినాయక్‌కి అప్పచెప్పారు. అదే సమయంలో సింహాద్రి విషయానికి వస్తే సినిమా స్టోరీ ముందుగా బాలయ్య వద్దకు వెళ్లిందట. ఈ సినిమాను బి. గోపాల్ బాలయ్యతో తీయాలనుకున్నారట. బాలయ్యకు కథ చెప్పగా ఆయనకు కథ నచ్చక పోవడంతో. బాలయ్య ఈ సినిమా కాదన్నారట. చెన్నకేశవరెడ్డి కథ నచ్చటంతో ఆ సినిమాతో బాలయ్య బిజీ అయిపోయాడు. ఇక చివరికి సింహాద్రి క‌థ‌ ఎన్టీఆర్ వద్దకు వెళ్ళింది.

ముందుగా రాజమౌళి ఎన్టీఆర్ తో సింహాద్రి సినిమా తీయటానికి ఒప్పుకోలేదట. తరవాత నిర్మాతలు సర్ది చెప్పగా రాజమౌళి ఎన్టీఆర్ తో ఈ సినిమా తీశారట. సింహాద్రి సినిమా ఎన్టీఆర్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ల‌లో ఒకటిగా నిలిచింది. ఇలా చెన్నకేశవరెడ్డికి, సింహాద్రి సినిమాకి ముందుగా అనుకున్న డైరెక్టర్లు ఒకరు.. త‌ర్వాత‌ చేసిన దర్శకులు ఒకరు అయ్యారు.