ఊరు తెలంగాణ.. దక్షిణాదిని ఏలిన 5 మంది స్టార్ హీరోయిన్స్ వీళ్ళే..!!

అప్పట్లో అయితే తెలంగాణ, ఆంధ్ర అనే ప్రాంత బేధాలు ఉండేవి కాదు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ప్రజలంతా కలిసి మెలసి జీవించేవాళ్ళు.. కానీ ఎప్పుడైతే ఆంధ్ర, తెలంగాణ మధ్య వైరం ఏర్పడింది. అప్పటి తరువాత ఎన్నో ధర్నాలు , గొడవలు , ప్రాణ త్యాగం జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండు రాష్ట్రాలుగా విడిపోయింది. అలా తెలంగాణ, ఆంధ్రగా మారిపోయిన సినీ ఇండస్ట్రీ కూడా ఈ మధ్యకాలంలో కర్నూలు, హైదరాబాద్ అన్నట్లుగా వేదికలను ఏర్పాటు చేసి మరీ సినిమాలను ప్రమోట్ చేస్తున్నారు సినీ తారలు. నిజానికి తెలంగాణ నుంచి గతంలో ఎంతో మంది టెక్నిషన్స్ నటీనటులు కూడా వచ్చి మెప్పించేవారు. కానీ ఈ మధ్యకాలంలో నటీనటులు, టెక్నీషియన్స్ మాత్రమే కాదు హీరోలు, హీరోయిన్లు కూడా తెలంగాణ నుంచి వచ్చి తెలుగు సినీ ఇండస్ట్రీలో చక్రం తిప్పుతున్నారు.

ముఖ్యంగా విజయ్ దేవరకొండ , హీరో నితిన్ లాంటి వాళ్ళందరూ కూడా తెలంగాణ నుంచి వచ్చి ప్రస్తుతం మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు. ఇక ఇప్పుడు తెలంగాణ నుంచి వచ్చి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దక్షిణాదినే తమ నటనతో ఊపేసిన ఐదు మంది స్టార్ హీరోయిన్లను ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.

1. విజయశాంతి:Vijayashanti: నటి విజయశాంతి పుట్టిన ఊరు ఏది.. ఎక్కడ ఉంది?తన నటనతో , డాన్స్ తో చిరంజీవి, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలకే చెమటలు పట్టించిన ఈ ముద్దుగుమ్మ తెలంగాణ బిడ్డ. వరంగల్లో పుట్టిన విజయశాంతి చెన్నైలో చదువుకున్నారు . ఒసేయ్ రాములమ్మ, కర్తవ్యం, ప్రతిధ్వని, అడవి చుక్క లాంటి ఎన్నో సినిమాలలో నటించి బ్లాక్ బస్టర్ విజయాలను సొంతం చేసుకుంది. ఇక ప్రస్తుతం అక్క, వదిన, తల్లి పాత్రలు చేస్తూ బిజీగా గడుపుతున్నారు విజయశాంతి.

2. సంగీత:
సీనియర్ హీరోయిన్ సంగీత అందచందాలతో దక్షిణాదినే ఒక ఊపు ఊపింది. ఇక వరంగల్ కి చెందిన సంగీత సినిమాలలో మంచి అవకాశాలను అందుకున్నారు. ప్రస్తుతం హీరోయిన్ గా సినీ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పి.. తల్లిగా ,అక్కగా , వదినగా పలు క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలు చేస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.

3. కీర్తి రెడ్డి:Abhishek Bachchan's former co-star Keerthi Reddy and ex-husband Sumanth  come under same roof after many years of divorce
ఈమె నటించింది ఒకటి రెండు చిత్రాలు అయినా ప్రేక్షకులు గుండెల్లో చిరస్థాయిగా మిగిలిపోయిన ముద్దుగుమ్మ కీర్తి రెడ్డి. తెలంగాణ నిజామాబాద్ జిల్లాకు చెందిన ఈమె తొలిప్రేమ సినిమాతో ఎంట్రీ ఇచ్చి తొలిప్రేమలోనే యువతను కట్టిపడేసింది. మహేష్ బాబు నటించిన అర్జున్ సినిమాలో కూడా సోదరి పాత్రలో నటించింది.

4 ప్రత్యూష:Prathyushaతెలంగాణలోని భువనగిరి ప్రాంతంలో జన్మించిన ప్రత్యూష కెరియర్ ప్రారంభంలో కలుసుకోవాలని అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. కొన్ని సినిమాలలో నటించినా.. చెరగని ముద్ర వేసుకున్న ఈ ముద్దుగుమ్మ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడం చాలా బాధాకరమని చెప్పాలి.

5. రేష్మ రాథోడ్:Telangana poll: Reshma Rathore - Actress turns MLA candidate for BJPఈ రోజుల్లో అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన రేష్మ రాథోడ్ కూడా తెలంగాణలోని ఇల్లందు ప్రాంతానికి చెందినవారు బాడీగార్డ్ ,లవ్ సైకిల్ వంటి సినిమాలలో హీరోయిన్ గా నటించింది.