రమ్యకృష్ణ కెరీర్ ను టర్న్ తిప్పిన సినిమా ఇదే..ఆ రోజుల్లోనే సంచలన రికార్డ్..!!

సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 80-90వ దశకంలో అగ్ర హీరోయిన్‌గా తెలుగు చిత్ర సీమను ఒక ఊపు ఊపింది. రమ్యకృష్ణ భలే మిత్రులు అనే సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమలో హీరోయిన్‌గా తన కెరీర్ ను మొదలుపెట్టింది. ఇక అదే సమయంలో రమ్యకృష్ణ తన కెరియర్ ఆరంభంలో అనేక ఇబ్బందులను ఎదుర్కొంది. ఆమె చేసిన సినిమాలన్నీ సరిగ్గా ఆడక పోవడంతో ఆమెను ఐరన్ లెగ్ హీరోయిన్ గా ముద్రవేశారు.

unknown facts about actress ramya krishna, ramyakrishna, unknown facts, interesting facts, ramya krishna movies entry, bhale mitrulu movie, akshintalu movie, tollywood, guru vempati chinasatyam, kuchipudi, rajnikanth, negative roles, narasimha movie ...

ఆ టైంలో ఆమె చేసిన సినిమాల్లో ఆమె నటన బాగున్నా సినిమా ఆడకపోవటంతో మంచి పేరు వచ్చేది కాదు. ఇలా తాను చేసిన సూత్రధారులు సినిమాలో రమ్యకృష్ణ పాత్రకు మంచి పేరు వచ్చింది. అయినా కానీ సినిమా అయితే కమర్షియల్ గా హిట్ అవ్వలేకపోయింది. ఇక ఆ సమయంలో రమ్యకృష్ణ నటిస్తే సినిమా ఫ్లాఫ్ అవుతుందని టాక్ జోరుగా ప్రచారం అయింది. రమ్యకృష్ణ ఐరన్ లెగ్ సెంటిమెంట్ వలన ఆమెకు చాలా సినిమా అవకాశాలు వచ్చిన తర్వాత అవి క్యాన్సిల్ చేసుకున్నారు.

Sutradharulu – Where Was It Shot

అదే సమయంలో కలెక్షన్ కి మోహన్ బాబు రమ్యకృష్ణ హీరో- హీరోయిన్లుగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో అల్లుడుగారు సినిమా తీశారు. ఈ సినిమా మోహన్ బాబుకు రమ్యకృష్ణకు తిరుగులేని సూపర్ హిట్ ను తీసుకొచ్చింది. ఈ సినిమా ఆ టైంలోనే 75 కేంద్రాలు 100 రోజులు ఆడి మోహన్ బాబుకు తిరుగులేని స్టార్ డమ్ తీసుకువచ్చింది. అదే సందర్భంలో రమ్యకృష్ణ కి ఐరన్ లెగ్ అనే మార్కును ఈ సినిమా ద్వారా ఆమె పోగొట్టుకుంది. ఇప్పటికి కూడా సినిమాలో నటించి ప్రేక్షకులను ఆలరిస్తూనే ఉంది. బాహుబలి సినిమా నుంచి రమ్యకృష్ణ కెరియర్ బాగా ఊపందుకుంది. ఇప్పుడు రమ్యకృష్ణ ఏ సినిమాలో నటిస్తే ఆ సినిమా హిట్ అవుతుందనే టాక్ వచ్చింది.

Alludugaru streaming: where to watch movie online?

Share post:

Latest