ఆ కారణం గానే తారక్ 30వ సినిమా షూటింగ్ ఆలస్యం..!!

జూనియర్ ఎన్టీఆర్.. డైరెక్టర్ కొలటాల శివ దర్శకత్వంలో తన 30వ సినిమా ప్రకటించి చాలా రోజులు అవుతోంది.. అయితే ఈ సినిమా షూటింగ్ ఆలస్యం విషయంలో ఎన్టీఆర్ అభిమానులు చాలా సీరియస్ గా ఉన్నారని చెప్పవచ్చు. అయితే ఈ సినిమా అలా డిలే అవ్వడానికిముఖ్య కారణం ఏమిటి అని గందరగోళంలో ఉన్నారు అభిమానులు. అయితే ఈ ఆలస్యానికి గల కారణాలు అనేకం ఉన్నప్పటికీ ఇటీవల మాత్రం కొన్ని కథనాలు బాగా వినిపిస్తున్నాయి. వాటి గురించి చూద్దాం.Jr NTR and Koratala Siva's NTR30 delayed due to Acharya's failure? - Movies  NewsRRR సినిమా విడుదల తర్వాత ఎన్టీఆర్ వెంటనే సినిమాని ప్రారంభించాలనుకున్నారు. కానీ ఎన్టీఆర్ క్రేజ్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ హీరోగా అందుకున్నారు. అందుకు తగ్గట్టుగానే కథని కొరటాల శివ సిద్ధం చేయవలసిన పరిస్థితి ఉన్నది. దీని వల్లనే ఇతడు ఇన్ని రోజులుగా ఇంత సమయాన్ని తీసుకుంటున్నారనే వార్తలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. ఇక అంతే కాకుండా ఈ చిత్రంతో అటు ఎన్టీఆర్ ఇటు కొరటాల శివకు ఇద్దరి కెరియర్ చేంజ్ కావాలని ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అందుచేతనే కొరటాల శివ స్క్రిప్ట్ పై చాలా సీరియస్ గా వర్క్ చేస్తున్నట్లు సమాచారం. ఇక అక్టోబర్ నెల నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభించాలని తెలుస్తున్నది.NTR30: Jr NTR-Koratala Siva film's motion poster out- Cinema expressRRR సినిమా కోసం ఎన్టీఆర్ చాలా శ్రమించారు. ఈ సినిమా కోసం ఏకంగా రెండు సంవత్సరాల పాటు తన కాల్ షీట్లను ఏ సినిమాకి అంకితం చేయలేదు. ఇక రాజమౌళి హార్డ్ హిటింగ్ యాక్షన్ కోసం.. తారక్ చాలా రిస్క్ చేశారని చెప్పవచ్చు. అందుకే ఎన్టీఆర్ కి భుజం నొప్పి చాలా ఇబ్బంది పెడుతోందట. అందుచేతన ఎన్టీఆర్ కి తగినంత విశ్రాంతి కావాలని వైద్యులు సూచించడంతో నాలుగు వారాలపాటు ఏ షూటింగ్లో పాల్గొనకుండా ఉన్నట్లు సమాచారం. వాస్తవానికి ఏ హీరో కి అయినా సరే యాక్షన్ సినిమాలలో రిస్కులు ఉంటాయని చెప్పవచ్చు. ఎన్ని సౌకర్యాలు ఉన్నా రిస్కులు చేయవలసి వస్తుంటుంది. అలాంటి సమయంలో కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొంటూ ఉంటారు. ఇప్పుడు ఎన్టీఆర్ కూడా ఇలాంటిదే ఎదుర్కొన్నారు అందుచేతనే కొరటాల శివ సినిమా షూటింగ్ ని అక్టోబర్ నెలలో ప్రారంభం కానున్నట్లు సమాచారం.

Share post:

Latest