పల్లెని ఓడించేది తమ్ముళ్లే?

ఘోర ఓటమి ఎదురయి అధికారం కోల్పోయిన సరే తమ్ముళ్లలో పెద్దగా మార్పు వచ్చినట్లు కనిపించడంలేదు…అధికారంలో ఎలాగైతే ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయించుకోవాలని చూశారో…అలాగే ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నారు…దీని వల్ల పార్టీకి డ్యామేజ్ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు…గత ఎన్నికల్లో టీడీపీ నష్టపోవడానికి ఆధిపత్య పోరు కూడా ఒక కారణం.

ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయాక కూడా అదే పరిస్తితి చాలా చోట్ల ఉంది. ఎక్కడకక్కడ గ్రూపు రాజకీయాలు నడుస్తున్నాయి. అలా గ్రూపు రాజకీయాలు అనంతపురం జిల్లా పుట్టపర్తిలో కూడా నడుస్తున్నాయి. మొదట నుంచి పుట్టపర్తి టీడీపీకి అనుకూలమైన నియోజకవర్గమే. కానీ ఇక్కడ మాజీ మంత్రి పల్లెరఘునాథ్ రెడ్డి సరిగ్గా పనిచేయకపోవడం వల్ల…టీడీపీ పరిస్తితి దిగజారుతూ వస్తుంది.   2014లో గెలిచిన పల్లె..మంత్రిగా కూడా పనిచేశారు.

అయినా సరే పుట్టపర్తిలో బలం పెంచుకోలేకపోయారు. ఫలితంగా 2019 ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయారు. ఓడిపోయాక అయిన పల్లె దూకుడుగా పనిచేయడం, అందరినీ కలుపుకుని పార్టీని బలోపేతం చేసే కార్యక్రమాలు చేస్తున్నారా? అంటే పెద్దగా చేస్తున్నట్లు లేరు. పైగా ఇతర నియోజకవర్గాల్లో ఈయన వర్గ పోరు పెంచుతున్నట్లు టీడీపీ వర్గాల్లో ప్రచారం నడుస్తోంది. ఇదే క్రమంలో తాడిపత్రికి చెందిన జేసీ ప్రభాకర్ రెడ్డి..ఈ మధ్య పుట్టపర్తికి వచ్చి ఈ సారి పుట్టపర్తి టికెట్ సైకం శ్రీనివాస్ రెడ్డికే అని బాంబు పేల్చారు. దీంతో పల్లె వర్గం గుండెల్లో గుబులు మొదలైంది. అలాగే పల్లెకు వ్యతిరేకంగా పలువురు నేతలు సైతం పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే పుట్టపర్తి మున్సిపల్ మాజీ ఛైర్మన్ పీసీ గంగన్న, బుక్కపట్నం మాజీ ఎంపీపీ పెదరాసు సుబ్రహ్మణ్యం..పల్లెకు యాంటీ అయ్యారు. నెక్స్ట్ పల్లెకు సీటు ఇస్తే సహకరించమని చెప్పేస్తున్నారు. దీని వల్ల పల్లె పరిస్తితి ఇబ్బందికరంగా మారింది. నెక్స్ట్ ఎన్నికల్లో పోటీ చేస్తే వైసీపీ చెక్ పెట్టడం కాదు గాని…సొంత పార్టీ వాళ్ళే పల్లెకు చెక్ పెట్టేలా ఉన్నారు. మొత్తానికి తమ్ముళ్లే..పల్లెని ఓడించేలా ఉన్నారు.