నిఖిల్ ఆయన ఇంటికి వెళ్లి అడుక్కున్నాడా..? తెర పైకి సంచలన మ్యాటర్..!!

యంగ్ హీరో నిఖిల్ నటించిన కార్తికేయ 2 సినిమా రిలీజ్ అయి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమా విడుదలై భారీ కలెక్షన్లతో నిర్మాతలకు భారీ లాభాలను తీసుకొస్తుంది. తాజాగా ఈ సినిమా 100 కోట్ల కలెక్షన్ క్లబ్లో చేరటానికి దగ్గరలో ఉంది. అయితే ఈ సినిమా విడుదలకు ముందు పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. అప్పుట్లో అది పెద్ద వివాదమే తెచ్చి పెట్టింది . అది ఈ సినిమా రిలీజ్ అయ్యాక కూడా ఇప్పుడు కూడా సర్ధుమనగ లేదు. తాజాగా సీనియర్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ హీరో నిఖిల్ పై సంచనల వ్యాఖ్యలు చేశారు.

ఈ సినిమా విడుదలకు ముందు నిఖిల్ వివాదాస్పదంగా కొన్ని వ్యాఖ్యలు చేశాడు. తర్వాత ఈ సినిమా హిట్ అయ్యాక ఓ అగ్ర నిర్మాతను టార్గెట్ చేస్తూ నిఖిల్ వ్యాఖ్యలు చేశాడు. వాటిని దృష్టిలో పెట్టుకుని తమ్మారెడ్డి భరద్వాజ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..” నిఖిల్ కు దిల్ రాజు గురించి మాట్లాడే అర్హత లేదు. అలాగే సినిమా హిట్ అయినప్పుడు కాలర్ ఎగరయాల్సినా పని లేదు. హిట్ అయినప్పుడు ఒక మాట లేదంటే ప్లాఫ్ అయినప్పుడు మరో మాట మాట్లాడకూడదు. నీకు ఏదైనా ఉంటే ముందే మాట్లాడాలి. దిల్ రాజని సినిమా అని వాయిదా వేసుకోమని చెప్పాడు. ఆరోజు ఎందుకు తిట్టలేదు. ఒకవేళ నిజంగా నీకు దమ్ముంటే దిల్‌రాజు సినిమాకి పోటీగా నీ సినిమానిని విడుదల చేయాలి. నువ్వు విడుదల చేయకుండా..తీరా సినిమా విడుదల చేసే సినిమా హిట్ అయ్యాక ఇలా అనటం సరికాదు.

Telugu Dil Raju, Karthikeya, Nikhil, Tamma Bharadwaj-Latest News - Telugu

అలాగే నిఖిల్ , దిల్ రాజు ఇంటికి వెళ్లి నా సినిమాని కొనండి అంటు నువ్వు అడుక్కున్నావ్. నువ్వు వెళ్ళింది అబద్ధమా..? లేదా నిజమా ..? అన్న విషయం నీకు మాత్రమే తెలుసు. నువ్వు ఎవరివి దిల్ రాజు ఇంటికి వెళ్ళడానికి. నీకు ఏమి పని. ఒక విధంగా సినిమా రిలీజ్ తో హీరోకు ఏం సంబంధం ఉండదు. నువ్వు హీరోవి .హీరో పని హీరోో చూసుకోవాలి. నువ్వు సినిమాని డబ్బులు తీసుకోకుండా చేయలేదు కదా” అంటూ నిఖిల్ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

Share post:

Latest