బిగ్ బ్రేకింగ్: ఊహించని చిక్కుల్లో బాలకృష్ణ నిర్మాతలు… సుప్రీంకోర్టు నోటీసులు..!

తెలుగు సినిమా పరిశ్రమలో అగ్ర హీరోలలో ఒకరైన నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన చారిత్రాత్మక సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి. ఈ సినిమా 2017లో సంక్రాంతి కనుక విడుదలై బాలకృష్ణ కెరియర్ లోనే సూపర్ హిట్ సినిమాగా నిలిచింది. ఈ సినిమాకి డైరెక్టర్ క్రిష్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి ఎదుగురు నిర్మాతలగా ఉన్నారు. తాజాగా ఈ సినిమా నిర్మాతలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.

Gautamiputra Satakarni gets tax exemption. | Telugu Movie News - Times of  India

అయితే ఈ సినిమా చారిత్రాత్మక సినిమా అయినందున పను రాయితీ ఇవ్వాలంటూ అప్పట్లో ఈ సినిమా ప్రొడ్యూసర్లు అడగటం. అదే తరుణంలో ఈ సినిమాకు ప‌న్ను రాయితీ గవర్నమెంట్ ప్రకటించింది. అదే సమయంలో గవర్నమెంట్ పన్ని రాయితీ ఇచ్చిన టిక్కెట్టు ధరలను తగ్గించకుండా ఎక్కువ రేటుకి అమ్మడంపై ఆ టైంలో సినీ ప్రేక్షకులు వినియోగదారులు చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో నిర్మాతలపై సినీ ప్రేక్షకుల వినియోగాదారుల సంఘం వీళ్ళపై కోర్టులో కేసు వేశారు. ఇదే సందర్భంలో ఈ కేసు పై సుప్రీంకోర్టు ధర్మాశనం విచారణ జరిపి నిర్మాతలు సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి ఐదుగురు తెలంగాణ ఏపీ ప్రభుత్వానికి సహా ప్రతి వాదలుగా చేసి నోటీసులు జారీ చేసింది.