వావ్ కెవ్వుకేక‌… నాగార్జున – సూప‌ర్‌స్టార్ ఫిక్స్‌…!

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున కొత్త సినిమా దిఘోస్ట్. ఈ సినిమాను యాంగ్రీ యాంగ్‌ మాన్ రాజశేఖర్ తో గరుడవేగ సినిమా తీసి సూపర్ హిట్ కొట్టిన ప్రవీణ్ సత్తారు డైరెక్ట్ చేశారు. ఈ సినిమా యాక్షన్ అండ్ థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ గా రూపొందింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్, టీజర్ సినిమా పై అందరిలో భారీ అంచనాలు పెంచేసాయి.

తాజాగా ఆగస్టు 25న ఈ సినిమా నుండి ట్రైలర్ వస్తుందని సినిమా యూనిట్ ప్రకటించింది. ఈ ట్రైలర్ ని సూపర్ స్టార్ మహేష్ బాబు రిలీజ్ చేస్తున్నట్టు తెలిపింది. ఈ సందర్భంలో నాగార్జున అభిమానులు నాగార్జున-మహేష్ కాంబోలో సినిమా వస్తే మరో రేంజ్ లో ఉంటుందని చర్చించుకుంటున్నారు.

Nagarjuna's The Ghost On Shiva's Date

ఈ సినిమాలో నాగార్జునకు జోడిగా సోనాల్ చౌహాన్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఇతర పాత్రల్లో గుల్ పనాగ్, రవి వర్మ, మనీష్ చౌదరి, శ్రీకాంత్ అయ్యంగార్, అనేక సురేంద్రన్ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ 5న‌ దసరా కానుకగా భారీ ఎత్తున రిలీజ్ చేయ్య‌డానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు.