హైపర్ ఆది కళ్లు నెత్తికెక్కాయా..? సుధీర్ ను అంత మాట అనేసాడు ఏంటి..!!

బుల్లితెరపై సుడిగాలి సుధీర్ కు భారీ స్థాయిలో ఫాలోయింగ్ ఉంది. సుధీర్- రష్మీ జంట కలిసి స్కిట్, డాన్స్ చేసినా ప్రేక్షకుల నుంచి అదిరే స్థాయిలో రెస్పాన్స్ వస్తుంది. ఇటీవ‌ల‌ సుడిగాలి సుధీర్ రెమ్యునిరేషన్… ఇతర కారణాలవల్ల ఈటీవీ కి గుడ్ బాయ్ చెప్పి స్టార్ మాలో ప్రోగ్రాములు చేయడానికి ఒప్పుకున్నాడు. అయితే సుధీర్ కి ఈటీవీలో వచ్చినంత క్రేజ్ స్టార్ మా ఛానల్లో రావట్లేదు. అక్కడ చేసిన ప్రోగ్రాంలు కూడా సక్సెస్ కావడం లేదు.

దీంతో సుధీర్ అభిమానులను సైతం ఈ ప్రోగ్రామ్స్‌ నిరుత్సాహం కలిగిస్తున్నాయి. దీంతోపాటు సుధీర్ చేసిన పండుగాడు సినిమా కూడా ప్లాఫ్ అవడంతో సుధీర్ కెరీయ‌ర్ డౌన్ ఫాల్లో ఉందని అభిమానులు వాపోతున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు ఈటీవీలో మల్లెమాల నిర్మిస్తున్న ఒక ప్రోగ్రాంలో సుధీర్ టక్కున ప్రతిక్షమయ్యాడు. ఈటీవీ 27 ఇయర్స్ సెలబ్రేషన్ పేరుతో భ‌లే మంచి రోజు పేరుతో ఒక ప్రోగ్రాం ప్రసారం కానుంది. ఈ ప్రోగ్రామ్‌లో సుధీర్ ఎంట్రీ అవ్వగా హైపర్ ఆది సుధీర్ పై తన స్టైల్ లో పంచులు వేశాడు.

Sudigali Sudheer Vs Hyper Aadi Create Curiosity About This Week Jabardasth  Episodes | Sudigali Sudheer Vs Hyper Aadi: 'సుడిగాలి' సుధీర్ Vs 'హైపర్'  ఆది... సేమ్ క్యారెక్టర్ చేశారుగా!

సుధీర్ మాట్లాడుతూ మీరు వీళ్ల‌తో ఎంట్రీ ఏంటనిఅడగగా… నువ్వు వస్తున్నావ్ అని తెలిస్తే నేను అసలు ఈవెంట్ కి నేను రానని అన్నాడని ఇమ్మాన్యూల్ చెప్పగా అవతలి వ్యక్తి అవును అని చెప్పుకొచ్చాడు. ప్రదీప్ మాట్లాడుతూ సుధీర్ మిమ్మల్ని అందరిని ఈయన ఒక్కచోట ఉంచుతాడ నిఅని చెప్పగా అప్పుడు ముందు ఆయన ఒక్కచోట ఉండమని అంటూ ఆది సుధీర్ పై పంచ్‌లు వేశాడు. పక్కనున్నవారు అవునని కోరస్ పాడారు.

Telugu Etv, Posanikrishna, Pradeep, Rashmi, Sudheer-Movie

మనకు బ్రేక్ ఎప్పుడు లేదని సుధీర్ అంటుండగా… నీకు మేము ఎప్పుడో బ్రేక్ ఇచ్చామని నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అంటూ ఆది సుధీర్ పై సెటైర్లు కురిపించాడు. ఆదితో సుధీర్ నేను మారిపోయానని చెప్పగా… అవును నువ్వు పక్క చానల్ కి వెళ్ళిపోయావు అంటూ ఆది సుధీర్ ని హేళన చేశాడు. ఈ ప్రోమో ని చూసిన సుధీర్ అభిమానులు ఆది వేసిన పంచులకు ఆది కళ్ళు నెత్తికెక్కాయ్ అంటూ ఆదిని సోషల్ మీడియా ద్వారా ట్రోలింగ్ చేస్తున్నారు.

Share post:

Latest