స్టార్ యాంకర్ లాస్యకి బ్రేకప్.. తరువాత ఈ ముద్దుగుమ్మ ఏం చేసిందంటే..!

ప్రముఖ స్టార్ యాంకర్ లాస్య గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ముద్దుగుమ్మ మొదటగా మాటీవీలో సంథింగ్ స్పెషల్ ప్రోగ్రామ్‌తో తన యాంకరింగ్ ప్రారంభించింది. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగింది. సినిమాలలో నటించే ఛాన్స్ కూడా దక్కించుకుంది. రాజా మీరు కేక, ఎమ్మెల్యే,అబ్బాయితో అమ్మాయి వంటి సినిమాల్లో ఈ తార నటించింది. తెలుగు బిగ్ బాస్ 4 సీజన్‌లో కూడా ఈ ముద్దుగుమ్మ మెరిసింది. 77 రోజుల పాటు బిగ్‌బాస్ 4లో కొనసాగిన లాస్య తన వ్యక్తిగత జీవితం గురించి ఎన్నో తెలియని విషయాలు బయట పెట్టింది.

లాస్య పూర్తి పేరు లక్ష్మీ ప్రసన్న ప్రియాంక లాస్య రెడ్డి. ఇంజనీరింగ్ పూర్తి చేశాక బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చిందీ ముద్దుగుమ్మ. ఆ తర్వాత 2009లో మంజునాథ్‌తో ప్రేమలో పడింది. ఆపై అతడిని 2010లో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంది. అలా ఒక పండంటి బాబుకు కూడా ఆమె జన్మనిచ్చింది. అయితే ఇప్పుడు ఆమె లైఫ్ సంతోషంగానే ఉంది అనుకుంటున్న సమయంలో ఒక వీడియో కలకలం రేపుతోంది. ఆ వీడియోలో ఒక మగ వ్యక్తి ఫోన్ చేసి లెట్స్ బ్రేకప్ అని చెప్పాడు. దాంతో ఒక్కసారిగా కంగుతిన్న లాస్య.. ఆ తర్వాత ఎంచక్కా బిర్యానీ తింటూ ఎంజాయ్ చేసింది. బ్రేకప్ చెప్పినా ఏం పట్టనట్లు ఆమె ఫుడ్ తినడం చూసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.

అయితే వైరల్ అవుతున్న ఈ రీల్ వీడియోను ఆమె సరదాగా చేసి ఉండొచ్చని తెలుస్తోంది. బ్రేకప్ చెబితే ఏం బాధ పడకుండా లైఫ్ లో ముందుకు కొనసాగాలని అంటూ ఆమె ఈ వీడియో ద్వారా యువతకు తెలిపినట్లు స్పష్టమవుతోంది. లాస్య ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తన ఫ్యాన్స్ కి టచ్ లో ఉంటుంది. ఈ ముద్దుగుమ్మ తరచుగా ఫన్నీ రియల్ వీడియోలు చేస్తూ ఆకట్టుకుంటుంది. ఈ బుల్లి తెర స్టార్ కు ఇన్‌స్టాగ్రామ్‌లో 17 లక్షల వరకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ ముప్పైమూడేళ్ల యాంకర్ కు ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది.

Share post:

Latest