ఎన్టీఆర్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన సీత..జన్మ ధన్యం అంటూ!!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన తన నటనతో.. మంచితనంతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఎన్టీఆర్ తో నటించాలి అంటే ఇటు టాలీవుడ్ హీరోయిన్లు మాత్రమే కాదు బాలీవుడ్ హీరోయిన్ లు సైతం ఆసక్తి చూపుతున్నారు. మరీ ముఖ్యంగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాతో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్న ఎన్టీఆర్ కి ప్రస్తుతం హాలీవుడ్ లో కూడా అవకాశాలు వచ్చే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఇటీవల ఆస్కార్ బరి లో ఈయన పేరు ఉండబోతోంది అనే ప్రచారం కూడా జరుగుతుంది. ముఖ్యంగా చెప్పాలి అంటే టాలీవుడ్ లోనే నెంబర్ వన్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు ఇకపోతే ఇలాంటి హీరోపై సెన్సేషనల్ కామెంట్స్ చేశారు సీతారామం హీరోయిన్ సీత అలియాస్ మృణాల్ ఠాగూర్..

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మృణాల్ మహేష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్ వంటి స్టార్ హీరోలలో మీరు ఎవరితో నటించాలని అనుకుంటున్నారు? అని ప్రశ్నించగా ఆమె ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే ఎన్టీఆర్ తో సినిమా చేయాలని ఉంది అంటూ చెప్పేసింది. ఇక ఎన్టీఆర్ తో బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ అలాగే జాన్వి కపూర్ కూడా సినిమా చేయాలని కోరుకుంటున్నారు. అయితే ఆయన యాక్టింగ్ స్కిల్స్ తో పాటు ఆయన డాన్సింగ్ స్టైల్ ను కూడా అంతా ఇష్టపడుతూ ఉండడం గమనార్హం. మరి ఆమె కోరిక మేరకు ఎన్టీఆర్తో కలిసి నటించే అవకాశం వస్తుందో లేదో తెలియాల్సి ఉంది. కానీ ఆమె మాత్రం కచ్చితంగా ఎన్టీఆర్ సినిమా చేయాలని చెబుతూ ఉండడం గమనార్హం. అంతే కాదు ఎన్టీఆర్ తో సినిమా చేస్తే ఇక జన్మ ధన్యమైనట్లే అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఇలా అనడంతో ఎన్టీఆర్ అభిమానులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికొస్తే కొరటాల శివ దర్శకత్వంలో సినిమా మొదలుపెట్టబోతున్నారు.

Share post:

Latest