విలన్ గా అదిరిపోయే లుక్కులో సంగీత దర్శకుడు కోటి, ఫస్ట్ లుక్ పోస్టర్ అదుర్స్!

తెలుగు పరిశ్రమలో ఒకప్పుడు రచయితలుగా పనిచేసినవారు ఇపుడు ఆర్టిస్టులుగా కొనసాగడం మనకు తెలిసినదే. అయితే ఈమధ్య సంగీత దర్శకులు కూడా సినిమాలలో వేషాలకోసం ప్రయత్నిస్తున్నారు. రఘు కుంచే సింగర్ గా, సంగీత దర్శకుడిగా మనకు సుపరిచితుడే. అయితే ఈయన గత కొన్నాళ్ళనుండి ఆర్టిస్టుగా కూడా చేస్తున్నాడు. ఇకపోతే అదే వరుసలోకి వచ్చి చేరాడు ప్రముఖ సంగీత దర్శకుడు కోటి. అవును.. కోటి గతంలో సుదీర్ఘకాలం పటు ఎన్నో సూపర్ హిట్స్ ఆల్బమ్స్ ఇచ్చాడు. రాజ్ – కోటి కాంబినేషన్ గురించి మనకు తెలిసినదే. రాజ్ నుండి విడిపోయిన తరువాత కోటి సంగీతం తగ్గిందనే చెప్పుకోవాలి.

దాంతో ఆయన ఈమధ్యకాలంలో పలు రకాల టీవీ షోస్ లలో జడ్జిగా వ్యవహరించాడు. వీటితో పటు నటనపై కూడా దృష్టి సారించినట్టు తెలుస్తోంది. రీసెంట్ గా ఆయన విలన్ లుక్ లో ఉన్న పోస్టర్ ను రిలీజ్ చేశారు. అవును… కోటి త్వరలో విలన్‌గా కనిపించబోతున్నాడు. దీపికా, ఆరాధ్య జంటగా రవిశ్రీ దుర్గాప్రసాద్‌ దర్శకత్వం రూపొందుతున్న సినిమా “పగ పగ పగ”. ఈ సినిమాలో కోటీ ఓ వైవిధ్యమైన పాత్రను పోషిస్తున్నాడు. సంగీత దర్శకుడు కోటి పాత్రకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను ఇటీవల దర్శకుడు మోహర్‌ రమేష్‌ విడుదల చేశారు.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈసినిమాను త్వరలోనే రిలీజ్ చేస్తామంటున్నారు సదరు సినిమా టీమ్. కాగా ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన పోస్టర్‌కు విపరీతమైన స్పందన వచ్చింది. ఈ ఫస్ట్ గ్లింప్స్‌లో కోటి తన డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్, లుక్‌తో అందరినీ మెప్పించారు. హలో పెజ్జోని పేటోడికి పని ఇస్తే.. వాడు ఆఖరి క్షణంలో ఉన్నా పని పూర్తి చేసి చస్తాడు అంటూ చెప్పిన డైలాగ్ అద్భుతంగా ఉంది. ఈ ఫస్ట్ గ్లింప్స్‌లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచిందిఈ చిత్రంలో బెనర్జీ, జీవీకే నాయుడు, కరాటే కళ్యాణి, భరణి శంకర్, రాయల్ హరిశ్చంద్ర, సంపత్, జబర్దస్త్ వాసు లాంటి వారు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

Share post:

Latest