సింధు సాధించింది… “స్వర్ణ సింధూరం”..!

కామన్వెల్త్ క్రీడల్లో తెలుగు తేజం పీవీ సింధు తన సత్తా చాటింది. బ్యాట్మెంటన్ సింగిల్స్ లో గోల్డ్ మెడల్స్ సాధించి ఫైనల్స్‌లో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చింది. ప్రతిష్టాత్మకమైన క్రీడల్లో భారత్ కు మరోసారి పత‌కం వచ్చేలా చేసింది. బ్యాట్మెంటన్ మహిళా సింగిల్ ఫైనల్ లో అద్భుతమైన ప్రదర్శనతో బంగారు పత‌కాన్ని గెలిచి రికార్డు సృష్టించింది. బ్యాట్మెంటన్ కెరియర్ లోనే మరో అద్భుతమైన పత‌కాన్నిచేర్చుకుంది. బ్రిటన్ లోని బర్మింగ్‌హామ్‌ వేదికగా 2022 కామన్వెల్ క్రీడల్లో ప్రారంభం నుంచే భారత ఆటగాళ్లు దూకుడుగా ఆడుతూ భారత పతాకాన్ని రెపరెపలాడించారు కామన్వెల్త్ క్రీడల్లో భారతదేశానికి పథకాల వర్షం కురిపించారు.

 

ఈరోజు బర్మింగ్‌హామ్‌ లో జరిగిన బ్యాట్మెంటన్ మహిళా సింగిల్స్ విభాగం ఫైనల్స్ లో తెలుగు తేజం పీవీ సింధు అద్భుత ప్రదర్శన చేసి.. కెనడా క్రీడాకారిణి మిచ్చలేని ఓడించారు.సింధు మొదటి నుంచే ఆధిపత్యం కనపరుస్తూ (21-15,21-13) ప్రత్య‌ర్థికి మాత్రం అవకాశం ఇవ్వకుండా దూసు వెళ్లిపోయారు. తనకున్న అనుభవాన్ని అంతా ఉపయోగిస్తూ వరస షాట్లతో పైచీ సాధించి విజేతగా నిలిచింది.

World Champ - India's badminton star P V Sindhu has had a glittering career so far, and she's only 26 | The Economic Times

తనకు ఎదురులేదని చాటి చెప్పింది ఈ ప్రపంచానికి. సింధు తన మొత్తం కెరియర్ లో ఇదే మొదటి గోల్డ్ మెడల్ కావడం విశేషం.. దీనికి ముందు 2014 లో కాంస్యం గెలిచిన సింధు, 2018 రజిత పథకాలు సాధించింది , 2018లో ఫైనల్ వరకు చేరిన.. చివరి పోరులో మరో భారత బ్యాట్మెంటన్ స్టార్ సైనా నెహ్వాల్ చేతిలో ఓడిపోయిన విషయం మనకు తెలిసిందే. దీంతో పీవీ సింధు కామన్వెల్త్ క్రీడల్లో తొలిసారి గోల్డ్ మెడల్ సాధించింది. కామన్వెల్త్ లో భారత్ కు 18 స్వర్ణాల, 15 రజితాలు, 22 కాంక్ష పథకాలతో 5వ స్థానంలో కొనసాగుతుంది.

Share post:

Latest