పురుషాదిక్యతపై.. సంచలన వ్యాఖ్యలు చేసిన శృతిహాసన్..!!

ఏ సినీ పరిశ్రమలోనైనా..పురుషాదిక్యతపై తరచుగా పలు చర్చలు జరుగుతూనే ఉన్నాయి. స్త్రీ పురుషుల మధ్య సమానత్వం ఉండదని మేల్ స్టార్స్ తో సమానంగా రెమ్యూనరేషన్ ఇవ్వరని గతంలో పలువురు హీరోయిన్ సైతం తమ అభిప్రాయంగా తెలియజేయడం జరిగింది. మహిళల పట్ల విపక్షత ఉందని.. ఇక్కడ మేల్ డామినేషన్ ఎక్కువగా ఉందని తెలియజేయడం జరిగింది తాజాగా సౌత్ హీరోయిన్ శృతిహాసన్ కూడా ఈ జాబితాలో చేరిపోయింది. సమాజం మొత్తం అలానే ఉన్నందున సినీ పరిశ్రమలో మాత్రమే..పురుషాదిక్యత ఉంటుందనే విధంగా చూపడం సరికాదని శృతిహాసన్ తెలియజేసింది..Shruti Haasan Reacts To Her Wedding Rumorsసినిమా అనేది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న వాటికి ప్రతిబింబం మాత్రమే సమాజం మొత్తం మగవారి ఆధిపత్యంలో ఉన్నప్పుడు సినీ ఇండస్ట్రీని మాత్రమే నిందించడంలో అర్థం లేదని ఆమె తెలియజేసింది. ఇటీవల హీరోయిన్ తాప్సి కూడా సినీ పరిశ్రమలో మహిళల పట్ల వివక్షత ఉందని తన కెరియర్ ప్రారంభం నుంచి ఈ విషయాన్ని చూస్తున్నారని తెలియజేసింది. ముఖ్యంగా లోకేషన్ దగ్గర రెమ్యూనరేషన్ దగ్గర.. ఇలాంటి తేడాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని తెలిపింది. ఇక అంతే కాకుండా మేల్ స్టార్స్, ఫిమేల్ స్టార్స్ ను మరొక్కలాగా ట్రీట్ చేస్తూ ఉంటారని తెలియజేసింది తాప్సి.

కానీ స్థార్ డం వచ్చాక కానీ పరిస్థితులలో చాలా మార్పులు వస్తాయని.. కానీ ఎంత మార్పు వచ్చినా కూడా హీరోల కంటే తక్కువగానే చూస్తారని తాప్సి తెలియజేసింది. హీరోలతో పోలిస్తే తమ పారితోషకాలను చాలా తేడా ఉంటాయని కూడా తెలిపింది తాప్సి. ఇక నెపోటిజం గురించి శృతిహాసన్ మాట్లాడుతూ.. స్టార్ కిడ్స్ కు ఇండస్ట్రీలో అవకాశాలు వస్తాయని అందరూ భావిస్తూ ఉంటారు కానీ వారి తల్లితండ్రులు కేవలం ఇండస్ట్రీ ఎంట్రీ కోసం మాత్రమే ఉపయోగపడతారు కానీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలి అంటే సొంత టాలెంట్ ఉండాలని తెలియజేశారు. ప్రస్తుతం బాలకృష్ణ, ప్రభాస్ సరసన నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ.