ఈ స్టార్ హీరోయిన్లకు షాకులు మొదలయ్యాయి..అసలు విషయం ఏమిటంటే..!!

ఇక ఈనెల మొదటి నుంచి వివిధ కారణాలవల్ల షూటింగ్లను బంద్ చేయడం జరిగింది నిర్మాతలు. ఆ తర్వాత ఒక్కో సమస్యపై పలు విధాలుగా చర్చలు పరిష్కరిస్తు ముందుకు సాగుతున్నారు. బడ్జెట్లను కంట్రోల్ చేయడం కోసం ఎన్నో విధాలుగా పలు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు నిర్మాత మండలి వారు. ఇటీవల హీరోయిన్ల మేనేజర్లతో కూడా ప్రత్యేకంగా సమావేశమైన నిర్మాతలు పలు కీలకమైన అంశాలపై మాట్లాడినట్లుగా తెలుస్తోంది. వాటి గురించి చూద్దాం.

అంతకుముందే మా అసోసియేషన్ తో మా అధ్యక్షుడితో ప్రత్యేకంగా సమావేశమైన ఆర్టిస్టుల రెమ్యూనరేషన్ అదనపు సిబ్బంది ఖర్చుల పైన చర్చించడం జరిగింది. ఇప్పుడు ప్రధానంగా క్యారెక్టర్ ఆర్టిస్టులపై చర్చ మొదలైందని సమాచారం కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు కార్వాన్ ప్రత్యేకమైన ఫుడ్ వ్యక్తిగత సిబ్బంది లొకేషన్ లకు చేరుకోవడానికి ప్రత్యేకంగా ఒక కారును కూడా డిమాండ్ చేస్తున్నారు.ఈ విషయంలో నిర్మాతలు తాజాగా కోతలు విధించినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో నిర్మాతలు క్యారెక్టర్ ఆర్టిస్టులు ,హీరోయిన్ల మధ్య కొన్ని వ్యక్తిగత విషయాలపై చర్చించడం జరిగింది.ముఖ్యంగా హీరోయిన్ల మదర్ వ్యక్తిగత సిబ్బంది కి వారికి యొక్క విమాన ఖర్చులు, క్యారెక్టర్ ఆర్టిస్టులు, హీరోయిన్ల తమ పారితోషకాల నుంచే భరించాలని తెలియజేశారు. ఇక అంతే కాకుండా భోజనం విషయంలో కూడా చాలా కఠినంగా ఉండాలని నిర్మాతలు సైతం నిర్ణయించుకున్నారు. ఇక అంతే కాకుండా ముంబై గోవా తదితర ప్రాంతాల నుంచి వచ్చే హీరోయిన్లు వారి విమాన ఖర్చులతో పాటు వసతికి సంబంధించిన ఏర్పాట్లు వారే చూసుకోవాలి ఆ ఖర్చులు భరించాలి అంటే నిర్మాతలకు చాలా ఖర్చు అవుతుందని భావించి ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. ఇక హీరోయిన్లతో పాటు వచ్చిన వారి యొక్క సిబ్బంది ఖర్చులను కూడా హీరోయిన్లే భరించాలని తెలియజేశారు. మరి ఇలాంటి నిర్ణయంతో కనీసం ఇప్పుడైనా నిర్మాతలకు కలిసి వస్తుందేమో చూడాలి.

Share post:

Latest