మహేష్ బాబు కెరీర్ ని నిలబెట్టిన సినిమాలలో ఒక్కడు సినిమా కూడా ఒకటి. ఈ సినిమాతో మహేష్ బాబు ఓవర్ నైట్ కి స్టార్ హీరోగా మారిపోవడమే కాకుండా మాస్ సినిమాలు చేయగలననే కాన్ఫిడెంట్ కూడా పెరిగిపోయింది. ఎన్నో ప్లాపులతో సతమతమవుతున్న సమయంలో ఒక్కడు సినిమా మహేష్ ను నిలబెట్టేలా చేసింది. ఈ చిత్రానికి డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా 2003లో ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాని ప్రముఖ నిర్మాత ఎమ్మెస్ రాజు నిర్మించారు. ఇప్పటికీ వీరిద్దరి కాంబినేషన్ ఒక పవర్ఫుల్ కాంబినేషన్ అని చెప్పవచ్చు.ఇక అంతే కాకుండా అప్పట్లో గుణ శేఖర్ స్టార్ డైరెక్టర్ గా మార్చిన సినిమా ఇదే. ఇక ఈ సినిమా తర్వాత మహేష్ బాబు కెరియర్ పరంగా ముందుకు దూసుకుపోయారు. అయితే ఇప్పటివరకు మహేష్ బాబు కెరియర్ లో ఇలాంటి మాస్ సినిమా రాలేదని చెప్పవచ్చు. అయితే గతంలో ఎమ్మెస్ రాజు ఈ సినిమా సీక్వెల్ తీసే ఆలోచనలో ఉన్నట్లుగా తెలియజేశారు. అయితే ఈ విషయం సోషల్ మీడియాలో క్లారిటి ఇచ్చినట్లుగా సమాచారం. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు.కానీ ప్రస్తుత పరిస్థితులలో మహేష్ బాబు నిర్మాతతో ఒక్కడు లాంటి సినిమాని చేస్తారా అనేది ఇప్పుడు అభిమానులలో సినీ ప్రేక్షకులలో ప్రశ్నగా మారుతుంది. అయితే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం నిర్మాత ఎమ్మెస్ రాజు ఒక్కడు సినిమాకు సీక్వెల్ గా మరొక చిత్రాన్ని కచ్చితంగా నిర్మించాలని ఆలోచనలు ఉన్నట్లుగా సమాచారం. అయితే.. నటీనటులలో మార్పులు ఉంటాయని ఇతర నటీనటులతో టెక్నీషియన్స్ తో ఒక్కడు -2 సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. అయితే ఈ విషయంపై అధికారికంగా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు నిర్మాత ఎమ్మెస్ రాజు. మరి ఈ సినిమాతో నైనా ఆయన సక్సెస్ అవుతారేమో చూడాలి.