బిగ్ బాస్ ఫేమ్ మెహబూబ్ ఇంట్లో తీవ్ర విషాదం.. ‘ఒంటరిగా వదిలి వెళ్లావ్’ అంటూ ఎమోషనల్ పోస్ట్..

బిగ్ బాస్ కంటెస్టెంట్ మెహబూబ్ ఇంట్లో తీవ్ర విషాదం జరిగింది. గుండెపోటుతో మెహబూబ్ తల్లి మరణించిన వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.. జూలై 5న తన తల్లి చనిపోయినట్లు సోషల్ మీడియాలో మెహబూబ్ ఎమోషనల్ పోస్ట్ చేశాడు. దీంతోపాటు తల్లి సమాధి వద్ద నివాళులర్పిస్తున్న ఫొటోను తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశాడు. సోషల్ మీడియాలో మెహబూబ్ తన తల్లి గురించి రాసిన పోస్ట్ కన్నీళ్లు తెప్పిస్తోంది..

మెహబూబ్ తన అమ్మ గురించి రాసిన సుధీర్ఘ పోస్ట్ లో ఏం రాశాడంటే.. ‘అమ్మ నన్ను ఒంటరిగా వదిలి వెళ్లిపోయావ్.. నేను ఇకపై నిర్ణయాలు ఎలా తీసుకోవాలి? నేను ప్రతి రోజూ ఎవరితో మాట్లాడాలి?..అమ్మా నువ్వు లేకపోతే నేను ఎలా బతకాలి?.. నువ్వు లేకుండా ఎలా బతకాలో అర్థం కావట్లేదమ్మా.. నువ్వు నాకు ఎప్పుడూ అండగా ఉన్నావు.. నా ఎదుగుదల చూసి మురిసిపోయావు.. మాకోసం అన్ని త్యాగం చేశావు.. నువ్వు లేకుండా మా జీవితాలు ఎటు వెళ్తాయో అర్థం కావట్లేదు.. ప్రతి క్షణం నిన్ను మిస్ అవుతూనూ ఉంటానమ్మా.

జీవితం అంటే ఏంటో నేర్పించావు.. నువ్వు గర్వపడేలా చేస్తానమ్మా.. తమ్ముడు సుభాన్, డాడీలను జాగ్రత్తగా చూసుకుంటానని మాటిస్తున్నాను అమ్మా.. నిన్ను ఎప్పటికీ మిస్ అవుతూనే ఉంటానమ్మా’ అంటూ మెహబూబ్ భావోద్దేగంతో పోస్ట్ షేర్ చేశాడు.. కాగా, మెహబూబ్ తల్లి జూలై 5న గుండెపోటుతో మరణించారు. ఈ విషయాన్ని మెహబూబ్ ఓ ఎమోషనల్ పోస్ట్ తో సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు.

Share post:

Latest