త‌న‌కు ఎలాంటి మొగుడు కావాలో చెప్పి మ‌రీ షాక్ ఇచ్చిన స‌దా..!

సీనియర్ హీరోయిన్ సదా అంటే తెలియని తెలుగు ప్రేక్షకులు ఎవరు ఉండరు. 2000వ దశకం మొదట్లో అగ్ర హీరోయిన్ గా కొనసాగింది. తేజ ద‌ర్శ‌క‌త్వంలో ఆమె నితిన్ తొలి సినిమా జ‌యంలో హీరోయిన్‌గా చేసింది. త‌న తొలి సినిమా జయంతోనే సదాకు మంచి పాపులారిటీ వచ్చింది. ఆ సినిమాలో వెళ్ల వెళ్ల‌వయ్యా వెళ్ళు అని చెప్పే డైలాగ్ ఇప్పుడు కూడా వింటుంటే కొత్త‌గా ఉంటుంది. ఆ తర్వాత ఆమెకు మంచి ఛాన్సులే వ‌చ్చాయి.

Watch Jayam (Telugu) Movie Online for Free Anytime | Jayam (Telugu) 2002 - MX Player

విక్ర‌మ్ హీరోగా వ‌చ్చిన శంక‌ర్ సినిమా అప‌రిచితుడులో న‌టించింది. జూనియ‌ర్ ఎన్టీఆర్ తో నాగ సినిమాలో నటించింది. బాల‌య్య‌తో వీర‌భ‌ద్ర‌లోనూ చేసింది. అయితే గత కొంతకాలంగా స‌దా సినిమాలకు దూరంగా ఉంటుంది. మధ్య‌లో కొన్ని సినిమాల్లో కనిపించినా ఆమె అనుకున్న సక్సెస్ దక్కలేదు. అయితే ఇప్పుడు తాజాగా సదా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సదా మాట్లాడుతూ నా జీవితాన్ని నేనూ సంతోషంగా గడపాలనుకుంటున్నాను. నాకు పార్టీలకు, పబ్‌ల‌కు వెళ్లే అలవాటు లేదు. ఆల్కహాల్ కూడా అసలు నేను తాగను అని చెప్పింది.

Telugu heroine sadha glamorous pics-Telugu heroine sadha glamorous pics - Sadha, Actress Sadha, Mind Sadha, Sadafmohammed, Sadha Hot, Sadha Hot Pics, Sadha Spicy

సదా తన‌ పెళ్లిపై ఒక ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. నాకు ఒక వ్యక్తిపై ఆధారపడి జీవించడం ఇష్టం లేదు.. అలా ఉంటే నేను సంతోషంగా ఉండలేను. అందుకే నేను పెళ్లి చేసుకోకూడదని అనుకుంటున్నాను. అదే క్రమంలో ఆమె పెళ్లి చేసుకునే వ్యక్తి ఎలా ఉండాలో కూడా చెప్పింది. పెళ్లి చేసుకునే వ్యక్తి వెజిటేరియన్ అయ్యి ఉండాలి, అతను ఒకరిపై ఆధారపడకూడదు. అలాగే నా సంపాదనపై నా భర్త ఆధారపడకూడదు. అలాంటి వ్యక్తి దొరికితే పెళ్లి చేసుకుంటానంటూ సదా హాట్ కామెంట్ చేసింది.