అనాధ ఆశ్రమంలో చేరిన రాకేష్ మాస్టర్.. ఆమె వల్లేనా..?

డాన్సర్ గా తన కెరీర్ ను మొదలుపెట్టిన రాకేష్ మాస్టర్.. డాన్స్ మాస్టర్ గా ఏకంగా 1500 సినిమాలకు డాన్స్ కంపోజర్ గా పనిచేశారు. ఇక ఈయన అసలు పేరు రామారావు. ప్రస్తుతం టాప్ డాన్స్ మాస్టర్లుగా ఉన్న జానీ మాస్టర్ , శేఖర్ మాస్టర్ లు ఈయనకు శిష్యులుగా ఉండేవారు. ముఖ్యంగా సీతయ్య , దేవదాసు, చిరునవ్వుతో , లాహిరి లాహిరి లాహిరిలో వంటి ఎన్నో అద్భుతమైన సినిమాలకు కొరియోగ్రఫీ చేసిన రాకేష్ మాస్టర్ ఢీ షో ద్వారా మరింత పాపులారిటీని సంపాదించుకున్నారు. బషీర్ అనే కంటెస్టెంట్ కి ఢీ షో లో డాన్స్ మాస్టర్ గా ఉండేవారు. అడపాడదపా జబర్దస్త్ లో కూడా కనిపిస్తూ ఉంటారు. ఇక ఇదంతా పక్కన పెడితే ఈయన తాజాగా అనాధాశ్రమంలో చేరారు అనే వార్త వైరల్ అవుతుంది.Rakesh Master Wiki, Biography, Age, Movies, Images - News Bugz

అసలు విషయంలోకి వెళితే భార్యను వదిలేసి..కనక లక్ష్మీ అనే ఇంకొక మహిళతో సహజీవనం చేస్తూ ఉన్న రాకేష్ మాస్టర్ ను ఆమె బాగా మోసం చేయడంతో భరించలేక కన్నీరు పెట్టుకోవడమే కాదు అనాధాశ్రమంలో చేరినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. అంతేకాదు ఈ విషయాన్ని స్వయంగా ప్రముఖ టీవీ ఛానల్ తో రాకేష్ మాస్టర్ చెప్పుకోవడం జరిగింది. ఇక ఈయనకు కూతురు రిషిక , కొడుకు చరణ్ తేజ ఉన్నారు. ఇక వీరిద్దరిని కనక లక్ష్మి బాగా తిట్టిందని అవి తట్టుకోలేకపోయానని చివరికి మేనల్లుడు దగ్గరికి వెళ్తే అక్కడ కూడా వారిని అవమానించిందని అందుకే ఇవన్నీ భరించలేక అనాధాశ్రమంలో చేరాను అని తెలిపాడు రాకేష్ మాస్టర్.Kanaka lakshmi amma/Rakesh master dancing with second wife  ||#rakeshmastertrolls - YouTube

అంతేకాదు కూతురిపై ప్రేమతో మాట్లాడిన సరే కూతురుతో సంబంధం ఉంది అంటూ ఎలా పడితే అలా మాట్లాడేది అని.. తీవ్రంగా చిత్రవధకు గురి చేసింది అని ఆయన తెలిపారు. ఇకపోతే ఆమెతో సహజీవనం చేయడానికి కూడా కారణాలు ఉన్నాయని తెలిపారు రాకేష్ మాస్టర్ . ఒకానొక సమయంలో పవన్ కళ్యాణ్ మీద అనుచిత వ్యాఖ్యలు చేశానని.. ఆయన అభిమానులు నా కొడుకుని కొట్టడానికి రావడంతో.. నా భార్య వాళ్ళ అమ్మ నన్ను ఇంటికి రావద్దని చెప్పారు. ఇక ఆ సమయంలోనే ఈ కనక లక్ష్మీ అనే మహిళ పరిచయమయ్యింది. తినడానికి కూడా తిండి లేని సమయం లో ఇబ్బంది పడుతున్న రోజుల్లో కనక లక్ష్మీ మూడు పూటలా వేడివేడి అన్నం పెట్టేది . అలా కొన్ని నెలలు బాగా చూసుకుంది. ఆ తర్వాత ఆమె అసలు రూపం బయటపడింది అంటూ చెప్పుకొచ్చారు.

ఇక నా కూతురు రిషిక నాతో మాట్లాడినా ఈమె తట్టుకునేది కాదు బాగా గొడవ పెట్టేది . నా కూతురు రిషికను విపరీతంగా అవమానించింది.. ఎవరితో తిరుగుతున్నావ్ అంటూ అనుమానించింది.. ఇక నా కొడుకు చరణ్ నామీద కోపంగా ఉన్నాడు.. భార్య కూడా రావద్దని చెప్పింది ఇక ఇవన్నీ భరించలేక అనాధాశ్రమం లో జీవనం సాగిస్తున్నట్లు మీడియాతో వెల్లడించారు.

 

Share post:

Latest