రాజమౌళి – మహేష్ బాబు సినిమా స్టోరీ ఇదే… వావ్ మ‌తులు పోయేలా ఉందే…!

దర్శ‌క‌ధీరుడు రాజమౌళి బాహుబలి సినిమాతో తెలుగు సినిమాను పాన్ ఇండియా లెవెల్‌కు తీసుకువెళ్లిపోయాడు. ఆ సినిమాతో తెలుగు సినిమాలంటే ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్‌ వచ్చింది. ఆయన తర్వాత తీసిన త్రిబుల్ ఆర్ సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌. ఈ సినిమా త‌ర్వాత రాజ‌మౌళి మహేష్ బాబుతో సినిమా చేస్తోన్నాడు. రాజమౌళి – మహేష్ సినిమా 2023లో మొదలుకానుంది.

Mahesh-Rajamouli: రాజమౌళి ఆర్ఆర్ఆర్ పబ్లిసిటీ మహేష్ కోసమట!

ఆ సినిమాను బాహుబలి – ఆర్ఆర్ ను మించిన స్థాయిలో తీయాలని…. తెలుగు సినిమా స్థాయిని ప్ర‌పంచ వ్యాప్తంగా మ‌రింత ఎల్ల‌లు దాటించాల‌ని రాజమౌళి చూస్తున్నాడు. దానికి ఇప్పటినుంచి ప్లానింగ్ చేసుకుంటు వెళ్లాల‌ని అనుకుంటున్నాడు. అలాంటి హైప్‌ రావాలంటే ఇప్పుడు త్రిబుల్ ఆర్ సినిమాను కూడా వ‌ర‌ల్డ్ వైడ్‌గా ర‌క‌ర‌కాలుగా ప్ర‌చారం చేసుకోవాల‌న్న‌ది కూడా జ‌క్క‌న్న ప్లాన్‌.

మహేష్ – రాజమౌళి కాంబోలో వచ్చే సినిమా ఎలాంటి జానర్ లో ఉంటుందనేది ఇంకెవరికీ తెలియదు. అయితే ఆఫ్రికా అడ‌వులు అడ్వంచ‌ర్ థ్రిల్ల‌ర్ నేప‌థ్యంలో ఈ సినిమా క‌థ ఉంటుంది. దీనిపై ఈ స్టోరీ ర‌చ‌యిత రాజ‌మౌళి తండ్రి విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ ఇప్ప‌టికే క్లారిటీ ఇచ్చేశారు. అస‌లు క‌ళ్లు చెదిరిపోయే యాక్ష‌న్‌, విజువ‌ల్స్‌తో ఈ సినిమా ఉండ‌బోతోంద‌ట‌.

Rajamouli spills beans on Mahesh Babu's film - TeluguBulletin.com

ఈ సినిమాలో యాక్ష‌న్‌కు రాజ‌మౌళి పెద్ద పీఠ వేయ‌బోతున్నాడు. ఏదేమైనా మ‌హేష్‌బాబును ఓ హాలీవుడ్ హీరో రేంజ్ లో అయితే చూపించాల‌న్న‌దే జ‌క్క‌న్న క‌సిగా తెలుస్తోంది.

Share post:

Latest