థియేటర్లకు అసలు శత్రువు రాజమౌళి.. వర్మ షాకింగ్ కామెంట్స్..!!

ప్రస్తుతం ఆగస్టు 1వ తేదీ నుంచి నిర్మాతల బిల్డ్ సభ్యులు సినిమా షూటింగ్లను బంద్ చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా థియేటర్లకు ప్రేక్షకులు రావడం లేదని అందుకు ఓటీటీ ప్రభావం ఎక్కువనే కామెంట్స్ గట్టిగా వినిపిస్తున్నాయి. అయితే సినిమా థియేటర్లలో సినిమా టికెట్ రేటు ఒక ఎత్తైతే.. అందులో స్నాక్స్ ధరలు ఆకాశాన్ని అంటుతున్న నేపథ్యంలో చాలా మంది థియేటర్లలో సినిమా చూడడానికి రావట్లేదు అనే వాదన కూడా వినిపిస్తోంది. ఇకపోతే కొంతమంది హీరోలు మంచి కంటెంట్ తో వస్తే తప్పకుండా థియేటర్స్ కి జనాలు వస్తారని కూడా అంటున్నారు. అయితే థియేటర్స్ కు ఈ క్రమంలో ఈ సమస్య రావడానికి ముఖ్య కారణం రాజమౌళి అన్నట్లుగా దర్శకుడు వర్మ ఒక వివరణ ఇచ్చాడు.Rajamouli: RGV influenced me as a filmmaker

తెలుగు చిత్ర పరిశ్రమలో గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఒక సంక్షోభం ఏర్పడింది. ముఖ్యంగా ఓటీటీ ప్రభావం కూడా సినిమాల పై తన ప్రభావాన్ని చూపిస్తోందని నిర్మాతలు తెలిపారు . అందుకే కాస్త ఆలస్యంగానే సినిమాలను ఓటీటీలలో విడుదల చేయాలని నిబంధనలు కూడా నిర్మాతలు తీసుకువచ్చారు. సినిమా నిర్మించడంలో ఖర్చు ఎక్కువ అవుతుందని , ఆర్టిస్టులు రెమ్యునరేషన్ కూడా తగ్గించుకోవాలని నిర్మాతలు చెబుతున్నారు. ఇక ఇదే విషయంపై ఇటీవల ఒక న్యూస్ ఛానల్ కు వర్మ ఇచ్చిన ఇంటర్వ్యూలో తనదైన శైలిలో వివరణ ఇచ్చారు అని చెప్పవచ్చు.RRR Movie Review - Movie Reviews

వర్మ మాట్లాడుతూ.. నిజానికి చిత్ర పరిశ్రమలో నిర్మాతలు ఇలా ఎందుకు సమ్మె విధిస్తున్నారో అర్థం కావడం లేదు. ఎవరైనా సరే బిజినెస్ గా ఆలోచించే సినిమాలను తెరపైకి తీసుకొస్తున్నారు.. అంతే కానీ అందరిని ఇండస్ట్రీతో ఏకం చేయడం ఒక అబద్ధం అవుతుందని ఆయన తెలిపారు. ఇక జనాలలో కూడా చాలా మార్పు వచ్చింది..ఎవరు కూడా ఎక్కువ సేపు ఒక సినిమాను చూడడానికి ఇష్టపడడం లేదు అని తెలిపారు. ముఖ్యంగా కొత్తగా అనిపించేటట్టు సినిమాలు తీయడమే కాకుండా విజువల్ ట్రీట్ ఇస్తే గాని థియేటర్లలో రెండు గంటలకు పైగా కూర్చోవడం లేదు అని వర్మ తెలిపారు. ముఖ్యంగా రాజమౌళి లాంటి భూతం వచ్చి ప్రేక్షకుల ఆలోచనల విధానాన్ని మార్చేసింది. RRR, KGF కంటే ఎక్కువ రేంజ్ లో కంటెంట్ ఉంటేనే సినిమాలు చూడడానికి థియేటర్లకు వస్తున్నట్లు వర్మ తెలిపాడు. ఒక రాజమౌళి కేవలం రెండు మూడు సంవత్సరాలకు మాత్రమే ఒక సినిమా తీస్తాడు. ఇక ఈయన మాత్రమే కాదు యూట్యూబ్ కూడా ఒక కారణం అని తెలిపాడు.