రూ.2 కోట్లు తిప్పి పంపిన ఏకైక మగాడు వాడే అంటున్న పూరీ..!!

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న పూరి జగన్నాథ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను మొదలుకొని నేటితరం అల్లు అర్జున్ , రామ్ చరణ్, ప్రభాస్ లాంటి హీరోలకు కూడా మంచి విజయాలను అందించిన దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు పూరీ జగన్నాథ్. ఇకపోతే తాజాగా ఈయన తెరకెక్కిస్తున్న చిత్రం లైగర్. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో శరవేగంగా పాల్గొంటున్న చిత్రం యూనిట్ నిన్న ఆదివారం వరంగల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను చాలా ఘనంగా నిర్వహించారు. ఇక ఈ ఈవెంట్ కి పూరి జగన్నాథ్ తో పాటు చార్మీ కౌర్, విజయ్ దేవరకొండ, అనన్య పాండే , మంత్రి దయాకర్ రావు తదితరులు హాజరయ్యారు.Puri Jagannadh Is No Rajamouli, Vijay Deverakonda?

ఇకపోతే ఈ ఈవెంట్లో పూరి జగన్నాథ్..విజయ్ దేవరకొండ గురించి మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఇక పూరి జగన్నాథ్.. విజయ్ దేవరకొండ గురించి మాట్లాడుతూ.. విజయ్ తో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. తను యాక్టింగ్ లోనే కాదు వ్యక్తిత్వంలో కూడా చాలా నిజాయితీగా ఉంటారు. సినిమా షూటింగ్ మొదలు పెట్టకముందు ఒక కోటి రూపాయలు నిర్మాతగా నేను విజయ్ కి ఇచ్చినప్పుడు ఇప్పుడు వద్దు.. సినిమాకు ఆ డబ్బు పెట్టేయండి .. తర్వాత చూసుకుందామని చెప్పాడు. ఇక షూటింగ్ పూర్తి అయిన తర్వాత నేను రెండు కోట్ల రూపాయల ఇస్తే వద్దు వాటిని మీ అప్పులు తీర్చుకోవడానికి ఉపయోగించండి.. అసలే అప్పులు కష్టాల్లో ఇబ్బంది పడుతున్నారు.. వాటిని ముందు తీర్చేయండి అని తెలిపాడు. దీన్ని బట్టి చూస్తే విజయ్ దేవరకొండ లాంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న మగాడు ఇంకొకడు లేడు అంటూ చాలా గొప్పగా వెల్లడించాడు.Have No Doubt About The Blockbuster Result Of Liger: Vijay Deverakonda At  Liger Warangal Fandom Tour

ఇక ప్రస్తుతం విజయ్ దేవరకొండ పై పూరీ జగన్నాథ్ చెప్పిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక విజయ్ దేవరకొండ కూడా పూరి జగన్నాథ్ ను తండ్రిలా భావిస్తున్నాను అంటూ చెప్పడం చాలా ఆనందంగా ఉందని చెప్పవచ్చు.

Share post:

Latest