డైరెక్టర్ మారుతితో సినిమా వద్దంటూ ప్రభాస్ అభిమానులు బైకాట్.. కారణం..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో డైరెక్టర్ మారుతి అంటే ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. మొదట ఈ రోజుల్లో చిత్రం ద్వారా అందరినీ ఆకట్టుకున్న ఈ డైరెక్టర్.. ఆ తర్వాత అలాంటి కథతోనే ఎన్నో సినిమాలను తెరకెక్కించి మంచి విజయాన్ని అందుకున్నారు. ఇక నేచురల్ స్టార్ నానితో కలిసి భలే భలే మగాడివోయ్ సినిమాతో మరింత విజయాన్ని అందుకున్నారు అయితే తాజాగా హీరో గోపీచంద్ తో కలిసి తెరకెక్కించిన పక్కా కమర్షియల్ చిత్రం బాక్సాఫీస్ దగ్గర అంచనాలను అందుకోలేక పోయింది. దీంతో ప్రభాస్ అభిమానులు కాస్త భయం మొదలయింది. ఈ రోజున ప్రభాస్, డైరెక్టర్ మారుతి సినిమా లాంచ్ అవుతూ ఉండడంతో అభిమానులు సైతం రంగంలోకి దిగి.. ఇప్పుడు ఇలాంటి సినిమా అవసరమా వద్దే వద్దంటూ సోషల్ మీడియాలో చాలా హంగామా చేస్తున్నారు.What we know so far about Prabhas-Maruthi project - Telugu News -  IndiaGlitz.comప్రస్తుతం ప్రభాస్ కు సైతం బ్యాడ్ టైమ్ నడుస్తున్నది ఇప్పటికీ కొంతమంది డైరెక్టర్లుకు అవకాశాలు ఇచ్చి చాలా సతమతమవుతున్నారు ప్రభాస్ రన్ రాజా రన్ చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమైన డైరెక్టర్ సుజిత్ తన తదుపరి చిత్రాన్ని ప్రభాస్ తో చెరకెక్కించే అవకాశం ఇచ్చాడు కానీ వీరి కాంబినేషన్లో వచ్చిన సాహో సినిమా భారీ డిజాస్టర్ గా మిగిలింది.. సాహసం, జిల్, తదితర చిత్రాలకు డైలాగులు రాసిన రాధాకృష్ణ కుమార్ తో రాధే శ్యామ్ సినిమా అవకాశం ఇవ్వగా అది కూడా ఫ్లాప్ లిస్టులో చేరిపోయింది. ఇక వరుస ప్లాపులతో సతమతమవుతున్న ప్రభాస్ ఇటీవలే డైరెక్టర్ మారుతీ తో ఒక సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది.

ఇక దీంతో ప్రభాస్ అభిమానులు సైతం డైరెక్టర్ మారుతీ తో సినిమా చేయకూడదని సోషల్ మీడియాలో పలు రకాల ట్విట్లు చేస్తూ ఈ చిత్రాన్ని బైకాట్ చేయాలని పలు రకాల ట్వీట్ లతో పలు పోస్టులను షేర్ చేస్తున్నారు. మరి ఈ సినిమా పైన చిత్ర బృందం క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.

Share post:

Latest