ప్ర‌భాస్ అందుకే.. టోపి పెట్టుకుంటున్నాడా..!

ఫాన్ ఇండియ‌ స్టార్ ప్రభాస్ ఇటీవ‌ల‌ ‘సీతారామం’ ఫంక్షన్ కు వ‌చ్చాడు. నిన్న మరోసారి హైదరాబాద్‌లోని సౌండ్ ఇంజనీర్ పప్పు (శ్రీనివాస్) కుమార్తె ఫంక్షన్‌కు కూడా వెళ్ళారు. రెండు ఫంక్షన్లల్లోనూ ఒకటే గెటప్ లో తలపై టోపి పెట్టుకొని కనిపించాడు. ఇప్పుడు దీనిపైనే సోష‌ల్ మీడియాలో జోరుగా చర్చ జ‌రుగుతుంది. ప్రభాస్ సలార్- అదిపురుష్, ప్రాజెక్ట్ కే సినిమాల్లో నటిస్తున్నారు. ఈ మూడు సినిమాలు ప్రభాస్ ఒక్కో దాంట్లో ఒక్కోలా కనిపిస్తాడు. కానీ బయట మాత్రం ప్రభాస్ ఒకే ర‌కంగా కనిపించడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

సలార్ లో ఊరమాస్ లుక్, ఆదిపురుష్ లో శ్రీరాముడి లుక్ లోకి.. ఇక ప్రాజెక్ట్ కేలో సైన్స్ ఫిక్షన్ గెటప్‌లో ఉంటాడు. బ‌య‌ట మాత్రం గెడ్డం పెంచి కాస్త ర‌ఫ్ లుక్ లోనే కనిపిస్తున్నాడు. ప్రభాస్ వరుసగా రెండు సార్లు బయటకు వస్తే రెండు సార్లు కూడా టోపీ పెట్టుకొని కనిపించడం ఏంట‌న్న‌ విష‌యం అందరూ ఆరాతీస్తున్నారు. సీతారామం ఫంక్షన్ కు తాను రానంటే బలవంతంగా తీసుకొచ్చారని ప్రభాస్ ఆ ఫంక్షన్ లోనే చెప్పుకొచ్చాడు.

ఇప్పుడు మరో ఫంక్షన్ లో కూడా అదే క్యాప్ తో క‌నిపించాడు. దీన్ని బట్టి చూస్తుంటే నిజంగానే ప్రభాస్ జుట్టు ఏమైనా ఊడిపోయిందా.? బట్టతల వచ్చిందా? అందుకే బయటకు రావడం లేదా ? కవర్ చేసుకోవడానికి టోపి పెట్టుకున్నాడా ? అన్న గుస‌గుస‌లు వినుసిస్తున్నాయి. ప్రభాస్ టోపి లేకుండా కనిపించినప్పుడు మాత్రమే ఈ అనుమానాలన్నీ పటాపంచలవుతాయి. లేదంటే ఈ టోపి ధరించినన్ని రోజులు ఈ పుకార్లు ఆగ‌వు.