కొడాలి టార్గెట్‌గా పవన్? 

పవన్ కల్యాణ్ ఓవరాల్ గా జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి ఎప్పటికప్పుడు ఫైర్ అవుతున్న విషయం తెలిసిందే…ఓ వైపు సినిమాలు చేసుకుంటూనే సమయం దొరికినప్పుడల్లా రాజకీయం చేస్తున్నారు..ప్రజా సమస్యలపై పోరాటం చేయడం, జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై విమర్శలు చేయడం చేస్తున్నారు. అయితే మొత్తం మీద పవన్..జగన్ ప్రభుత్వాన్ని గట్టిగా టార్గెట్ చేస్తున్నారు. కానీ నాయకుల విషయానికొస్తే…వైసీపీలో కొందరు నాయకులనే పవన్ టార్గెట్ చేస్తారు…కొందరు నాయకుల జోలికి పవన్ వెళ్లరు.

ఉదాహరణకు పేర్ని నాని, కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, కన్నబాబు, అంబటి రాంబాబు, బొత్స సత్యనారాయణ, అనిల్ కుమార్ యాదవ్…ఇలా కొందరినే టార్గెట్ చేస్తారు. అయితే ఎక్కువగా పేర్ని, కొడాలిపైనే పవన్ ఫోకస్ ఉంటుంది..ఎందుకంటే వారి విమర్శించినట్లు పవన్ ని ఎవరు విమర్శించలేరు. అందుకే ఏదొరకంగా వారి టార్గెట్ గా పవన్ విమర్శలు ఉంటాయి. ఇక కొడాలి అక్రమాలకు పాల్పడుతున్నట్లు పవన్ పలుమార్లు ఆరోపించారు. గుడివాడని పేకాటకు అడ్డాగా మార్చారని, నాని పలు అక్రమాలకు పాల్పడుతున్నారని అన్నారు.

తాజాగా ఆగష్టు 15 నాడు కూడా జగన్ పై విమర్శలు చేస్తుంటే కొడాలి నాని పేరు తీసుకొచ్చారు. 151 సీట్లలో గెలిపించింది ప్రజలపై దాడి చేసేందుకేనా అని వైసీపీ ఎమ్మెల్యేలను ప్రశ్నించిన పవన్, గుడివాడలో ఎమ్మెల్యే కనుసన్నల్లో ఇసుక దందా నడుస్తోందని, అక్రమ సంపాదనతో నెక్స్ట్ ఎన్నికల్లో కోట్లు ఖర్చు పెట్టేందుకు సిద్ధమయ్యారని విమర్శించారు. అందరూ ఎమ్మెల్యేలు అదే పనిలో ఉన్నారని మాట్లాడుతూనే..గుడివాడ పేరు సెపరేట్ గా తీశారు. ఇక గుడివాడ అంటే కొడాలి నాని మాత్రమే.

కొడాలినే స్పెషల్ గా టార్గెట్ చేస్తున్నట్లు కనిపిస్తారు. అలాగే వచ్చే ఎన్నికల్లో కొడాలికి చెక్ పెట్టాలని కూడా చూస్తున్నారు. టీడీపీతో పొత్తు పెట్టుకుని నానిని నిలువరించాలని అనుకుంటున్నారు. కానీ పొత్తు ఉన్నా లేకపోయినా కొడాలికి ఉండే ఇమేజ్ కొడాలికి ఉంది..కాబట్టి పవన్ ఎంత టార్గెట్ చేసిన ఉపయోగం ఉండదు.