హీరోలకు ఒక రూల్.. హీరోయిన్లకు మరొక రూలా అంటూ రెచ్చిపోయిన తమన్న..!!

మిల్క్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకున్న తమన్న సీటీమార్ సినిమాతో ఒకరకంగా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఇటీవల వచ్చిన ఎఫ్3 సినిమాతో ఈమె క్రేజ్ మళ్లీ పెరిగిపోయిందనే చెప్పాలి. ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్న కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. ఇక ఇంటర్వ్యూలో భాగంగానే తమన్నా మాట్లాడుతూ సినీ పరిశ్రమలో మనుషుల మధ్య చాలా తేడాలు చూపిస్తారు వీటి గురించి లేడీ ఆర్టిస్టులు సీరియస్ గా తీసుకోవడం లేదు. ముఖ్యంగా నేను పనిచేసిన సినిమాలలో ఏ అంశం గురించి అయినా మాట్లాడితే.. సజెషన్స్ ఇస్తే టెక్నీషియన్స్ వాటిని పట్టించుకునేవారు కాదు మహిళలకు సినిమా రంగంలో సరైన మర్యాద కూడా లేదు.. ఎక్కువగా హీరోయిన్స్ అంటే హీరోలను ప్రేమించే పాత్రలకే తీసుకుంటున్నారు. ఒకప్పుడు నా విషయంలో కూడా ఇదే జరిగింది.Tamannaah Bhatia reacts to trolls who called her 'fat' during her COVID19  recovery | Celebrities News – India TV

సినీ రంగంలో నటించే ఎవరైనా సరే ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తారు కదా? ఇలా మనుషుల మధ్య తారతమ్యాలు ఎందుకు చూస్తున్నారు.. ఇక పారితోషకం గురించి అయితే అస్సలు చెప్పాల్సిన అవసరం లేదు. హీరోలకు ఇచ్చే పారితోషకంలో సగం కూడా హీరోయిన్లకు ఇవ్వరు. ఇక గుర్తింపు అసలుకే ఉండదు. సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలలో హీరోలు పాల్గొనకపోయినా..పెద్దగా పట్టించుకోరు. కానీ హీరోయిన్లు పాల్గొనకపోతే వెంటనే హీరోయిన్ లకు దర్శకనిర్మాతలకు మధ్య విభేదాలు సమస్యలు అంటూ ప్రచారం చేస్తారు. ఇకనైనా మారండి.. మనుషులను సమానంగా చూడడం నేర్చుకోండి.. అంటూ తన మనసులోని బాధను బయటపెట్టింది తమన్నా.Tamannaah Bhatia : రెండేళ్ల తర్వాత ఖచ్చితంగా దాని గురించి ఆలోచిస్తా..  ఆసక్తికర కామెంట్స్ చేసిన మిల్కీబ్యూటీ.. | Actress tamanna bhatia about her  marriage | TV9 Telugu

అంతేకాదు ప్రేక్షకులను అలరించే హీరోలకు ఒక రూల్.. హీరోయిన్లకు మరొక రూలా అంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించింది. మొత్తానికైతే సినిమా ఇండస్ట్రీలో పారదర్శకతపై తమన్న చాలా ఇబ్బంది పడుతున్నట్లు స్పష్టం అవుతుంది. అయితే ప్రతి ఒక్క అమ్మాయి ఇలాంటి సమస్యలు ఎదుర్కొన్నా..అందులో కొంతమంది బయటకు చెప్పుకోలేకపోవడం గమనార్హం. దీన్ని బట్టి చూస్తే సమాజంలో ఆడవారికి ఎక్కడైనా సరే చిన్న చూపే అన్నట్లుగా అర్థం అవుతుంది.

Share post:

Latest