పవన్ హరి హర వీరమల్లు పరిస్థితి ఏమిటి? ‘వినోదాయ సితం’ అసలు మొదలు పెడతారా?

తెలుగునాట పవర్ స్టార్ పవన్ కల్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవలసిన పనిలేదు. రాజకీయకాల నడుమ పవన్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. అందులో రీమేక్ సినిమాలే ఎక్కువ వున్నాయి. పింక్ ఆధారంగా తెరకెక్కిన వకీల్ సాబ్ మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియుమ్ ఆధారంగా వచ్చిన భీమ్లా నాయక్ సినిమాలు సూపర్ హిట్టైన సంగతి అందరికీ తెలిసినదే. దాంతో పవన్ తమిళ హిట్ మూవీని తెలుగులో రీమేక్ చేయాలని ప్లాన్ చేశారు. దాని పేరు వినోదాయ సితం. సముద్రఖని నటించి తెరకెక్కించిన మూవీ నేరుగా ఓటీటీలో విడుదలై విమర్శకుల ప్రశంసల్ని సొంతం చేసుకుంది.

ఈ మూవీని కూడా త్రివిక్రమ్ చేత భారీ మార్పులు చేయించిన పవన్ కల్యాణ్ మరో సారి దేవుడి పాత్రలో నటించేందుకు రెడీ అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అలాగే ఇందులోని యంగ్ హీరో క్యారెక్టర్ లో సాయి ధరమ్ తేజ్ కనిపించబోతున్నాడని కూడా చెప్పుకొచ్చారు. సముద్రఖని దర్శకత్వంలో తెరపైకి రానున్న ఈ మూవీ పూజా కార్యక్రమాలు కూడా పూర్తి చేశారు. లాంఛనంగా సెట్స్ పైకి వెళ్లడమే మిగిలింది. ఇక ఇదే సమయంలో పవన్ కల్యాణ్ అనారోగ్యానికి గురవ్వడంతో ఇంటికే పరిమితం అయిపోయారు. ఈ మధ్యలో సినిమా షూటింగ్ నిలిపివేతలు గురించి తెలిసిందే.
lo
దాంతో ఓ పక్క పవన్ అభిమానులు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. ఓ వైపు వినోదాయ సితం షూటింగ్ ఆలస్యం కావడం, మరోవైపు షూటింగ్ స్టార్ట్ అయ్యి, మధ్య మధ్యలో ఆగుతూ సాగుతున్న హరి హర వీరమల్లు షూటింగ్ విషయంలో కూడా మెగాభిమానులు కాస్త గుర్రుగా వున్నారు. కాగా ఈ రెండు సినిమాల విషయంలో మాత్రం ఎలాంటి స్పష్టత లభించడం లేదు. మరో రెండు వారాలు ఆగితే కానీ పవన్ ఏం చేయబోతున్నాడన్నది ఓ క్లారిటీ వచ్చే అవకాశం లేదని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

Share post:

Latest