నయనతారను ఆ ఉద్దేశంతో అనలేదు.. కరణ్ క్లారిటీ..!

బాలీవుడ్ లో ప్రసారమవుతున్న కాఫీ విత్ కరణ్ షో .. మంచి పాపులారిటీ ని సొంతం చేసుకుంది. ఇక కేవలం బాలీవుడ్ లోనే కాకుండా దేశవ్యాప్తంగా మంచి పాపులారిటీ ని సంపాదించుకుంది. ఇకపోతే దిగ్విజయంగా 6 సీజన్లను పూర్తి చేసుకున్న ఈ షోకి ప్రస్తుతం ఏడవ సీజన్ కొనసాగుతోంది. కాఫీ విత్ కరణ్ 7వ సీజన్ కి అక్షయ్ కుమార్ , సమంత కలిసి హాజరయ్యారు. ఈ క్రమంలోని ఎన్నో ప్రశ్నలను కరణ్ అడగగా సమంతా కూడా తెలివిగా సమాధానం చెప్పింది. ముఖ్యంగా సమంత తెలివికి అక్షయ్ కుమార్ సైతం ఫిదా అయ్యాడు.Karan Johar Denies Disrespecting Nayanthara In Koffee With Karan 7; Says No  Offence To Her Fans - Filmibeat

ఇకపోతే ఈ క్రమంలోనే సమంత పై పొగడ్తల వర్షం కురిపించిన కరణ్ జోహార్ ఒక విధంగా నయనతార అభిమానులను తీవ్రంగా కోపానికి గురి చేశారు. ఇక ఈ నేపథ్యంలోని కరణ్ జోహార్ పై తీవ్రమైన ట్రోల్స్ కూడా వైరల్ అయ్యాయి. ఇదిలా ఉండగా కరణ్ జోహార్ సమంతతో మాట్లాడుతూ సౌత్ ఇండియాలో నువ్వే కదా నెంబర్ వన్ హీరోయిన్ అని అడిగాడు. అప్పుడు సమంత నేను కాదు నయనతార అని చెప్పగా .. కరణ్ జోహార్ మాత్రం ఆ సమాధానం నా లిస్టులో లేదు అంటూ ఊహించని విధంగా ప్రతిస్పందించాడు. ఇక ఒక విధంగా చూసుకుంటే.. ప్రేక్షకులు నయనతారను ఎంతగానో అభిమానిస్తారు. అందుకే ఆమె ఇండస్ట్రీకి వచ్చి 15 సంవత్సరాలు దాటినా కూడా అదే తరహాలో నెంబర్ వన్ స్థానాన్ని కొనసాగిస్తుంది.

ఇక అందుకే నయనతార కు సంబంధించిన ఏదో ఒక విషయం ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటుంది.కానీ కరణ్ మాత్రం ఒక విధంగా ప్రతిస్పందించడంతో అతనిపై నయనతార అభిమానులు కూడా తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ విషయంపై కరణ్ జోహార్ తాజాగా క్లారిటీ ఇచ్చారు. కరణ్ జోహార్ మాట్లాడుతూ.. నేను నయనతారను ఆ విధంగా కించపరచాలని అనుకోలేదు. కాకపోతే అభిమానులు నా మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారు అంటూ వివరణ ఇచ్చాడు. ఇక అంతే కాదు నేను ఓరోమ్యాక్స్ జాబితా ప్రకారం ఆ విధంగా తెలిపాను ఆ విషయంలో ముమ్మాటికి నయనతార ను నేను తక్కువ చేసి మాట్లాడలేదు అంటూ వివరణ ఇచ్చినప్పటికీ కరణ్ జోహార్ పై కామెంట్ లు మాత్రం తెగ వైరల్ అవుతున్నాయి.

Share post:

Latest