ర‌వితేజ కోసం రంగంలోకి దిగ్గిన నేష‌న‌ల్ అవార్డు విన్నర్.. ఇప్పుడు కధలో అసలైన మజా..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మాస్ మహా రాజా రవితేజ కు ఎలాంటి పేరు ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మాస్ అన్న పదానికి కొత్త అర్ధం తీసుకొచ్చింది ఈయనే. మాస్ అంటే నాలుక మడతపెట్టడాలు, పంచె పైకి కట్టడాలు…తొడ కొట్టడాలు అనే సాంప్రదాయం కొనసాగుతున్న ఈ ఇండస్ట్రీలో మాస్ అన్న పదానికి కొత్త మీనింగ్ ను సృష్టించి..మాస్ మహారాజ గా మన ముందు నిల్చున్నాడు. రవి తేజ నటన ను ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆయనకి జనాల్లో పిచ్చ ఫ్యాన్ ఫాలోయింగ్.

ఈ మధ్య ఏదో టైం బాగోలేక సినిమాలు అన్ని వరుస పెట్టి ఫ్లాప్ అవుతున్నాయే కానీ..ఒకప్పుడు ఆయన సినిమా లు ధియేటర్స్ లో రిలీజ్ అవుతున్నాయి అంటే ఎలాంటి రచ్చ ఉంటుందో మనకు తెలిసిందే. ఆ కటౌట్ లు..పాలాభిషేకాలు..అరుపులు కేకలు వామ్మో అది చెప్పితే అర్ధం అయ్యేది కాదు చూడాల్సిందే. ఇడియట్, భధ్ర సినిమా ల టైంలో స్టార్ హీరోలు కూడా రవితేజ క్రేజ్ చూసి షాక్ అయ్యారు. మరి అలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఈయన సినిమాలు నేటి పరిస్ధితి చూస్తే ఎవ్వరికైన జాలి వేస్తుంది.

రీసెంట్ గా రిలీజ్ అయిన రామరావు ఆన్ డ్యూటీ సినిమా కూడా హిట్ అయ్యిన్నట్లే అయ్యి..లాస్ట్ కి ఫ్లాప్ అయ్యింది. ఇక ఇప్పుడు రవితేజ కెరీర్ కి ఒక్క హిట్ చాలా అవసరం. ఆయన ఇండస్ట్రీలో హీరోగా తల ఎత్తుకుని తిరగాలంటే ఖచ్చితంగా హిట్ కావాలి..దాని కోసం రంగంలోకి దిగ్గాడు నేషనల్ అవార్డ్ విన్నర్..అనుప‌మ్‌ఖేర్. తన వైవిధ్యభరితమైన నటనతో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలో నటించిన ఈయన క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా వ‌ర‌ల్డ్ వైడ్‌గా మంచి గుర్తింపుని సొంతం చేసుకున్నాడు.

ఇప్పటికే పలు తెలుగు చిత్రలల్లో నటించడానికి సైన్ కూడా చేసారు. ఇక ఇప్పుడు రవితేజ కెరీర్ కి ఎంతో అవసరమైన సినిమా టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు చిత్రంలో భాగమైయ్యారు. ఈ విష‌యాన్ని చిత్ర బృందం అధికారికంగా వెల్ల‌డించింది. అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై అభిషేక్ అగ‌ర్వాల్ అత్యంత ప్ర‌తిష్టాత్మకంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాడు.

 

Share post:

Latest