శ్రీకృష్ణకు మళ్ళీ తిరుగులేదా?

25కి 25 ఎంపీలు ఇస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకోస్తానని జగన్…గత ఎన్నికల ముందు చెప్పిన విషయం తెలిసిందే…అయితే జగన్ మాట నమ్మి ప్రజలు 22 మంది ఎంపీలని గెలిపించారు. కానీ కేంద్రంలో బీజేపీకి పూర్తి మెజారిటీ రావడంతో…మనం ఇంకా ఏమి చేయలేమని జగన్ ముందే చేతులెత్తేశారు. అయితే జగన్ చేతులెత్తేసిన ఎంపీలు ఏదొక విధంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడతారని? ప్రజలు అనుకున్నారు..కానీ వైసీపీ ఎంపీలు…పెద్దగా రాష్ట్రం కోసం పార్లమెంట్ లో పోరాడిన సందర్భాలు తక్కువ. టీడీపీ తరుపున గెలిచిన ముగ్గురు ఎంపీలు ఎంతో కొంత పోరాడుతున్నారు.

- Advertisement -

వైసీపీలో 90 శాతం ఎంపీలు ఏదో మొక్కుబడిగా ఎంపీలు అయినట్లే ఉన్నారనే విమర్శలు వస్తున్నాయి. కానీ అందులో కొందరు ఎంపీలు బాగానే కష్టపడుతున్నారని తెలుస్తోంది. అలా వైసీపీలో కష్టపడుతున్న ఎంపీలో నరసారావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ముందు వరుసలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈయన లోక్ సభలో రాష్ట్ర ప్రయోజనాల కోసం బాగానే గళం విప్పుతున్నారు. అలాగే ఇటు తన పార్లమెంట్ పరిధిలో బాగానే పనిచేస్తున్నారు.

టోటల్ గా అయితే ఈ మూడేళ్లలో శ్రీకృష్ణ పనితీరు బాగానే ఉంది…మిగతా ఎంపీల మాదిరిగా శ్రీకృష్ణకు మరి బ్యాడ్ నేమ్ రాలేదు. అందుకే ఇటీవల వస్తున్న సర్వేల్లో నరసారావుపేటలో వైసీపీ మళ్ళీ గెలిచే అవకాశాలు ఉన్నాయని బయటపడింది. గత ఎన్నికల్లో శ్రీకృష్ణ మంచి మెజారిటీతో గెలిచారు..ఈ సారి కూడా పేటలో గెలిచి సత్తా చాటే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

ఒకవేళ పేట పరిధిలో ఉన్న అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ సత్తా చాటిన క్రాస్ ఓటింగ్ ద్వారా అయిన శ్రీకృష్ణ గెలిచి బయటపడేలా ఉన్నారు. ఎందుకంటే శ్రీకృష్ణకు టీడీపీ శ్రేణుల సపోర్ట్ కూడా బాగానే ఉంది. పైగా ఈయన అమరావతి రైతులకు అండగా నిలబడిన సందర్భాలు కూడా ఉన్నాయి. మొత్తానికి చూస్తుకుంటే మళ్ళీ నర్సరావుపేటలో శ్రీకృష్ణకు తిరుగుండదనే అనిపిస్తోంది.

Share post:

Popular