చిరంజీవి ఫస్ట్ లవ్ స్టోరీ..పడి పడి నవ్వుకున్న నాగార్జున..!!

ప్రేమ..లవ్.ఇష్క్..కాదల్..రకరకాలు గా పిలుచుకున్న..దాని ఫీలింగ్ ఒక్కటే. ప్రేమ కు చిన్న పెద్ద, కులమత బేధాలు తేడాలు ఉండవు. నిజానికి లవ్ ఎప్పుడు ఎక్కడ ఎవరి పై పుడుతుందో కూడా మనం చెప్పాలేం. అదో ఢిఫరేంట్ ఫీలింగ్ అంతే. అయితే, ఈ రోజుల్లో అబ్బాయిలకు అమ్మాయిలకు లవ్ చాలా సార్లు పుడుతుంది..పోతుంది..అదే వేరే మ్యాటర్. నిజమైన లవ్..ఫస్ట్ లవ్ ఒక్కసారే పుడుతుంది..ఓ అమ్మాయిని అబ్బాయి చూడగానే గుండెల్లో గంటలు మోగుతాయి. అబ్బాయిని అమ్మాయిని చూడగానే మనసులో ఏదో తెలియని ఫీలింగ్..అది చెప్పితే అర్ధం అయ్యేది కాదు..ఆ ఫీలింగ్ అనుభవించాల్సిందే..

అయితే, ఇలాంటి ఫీలింగ్ నే అనుభవించాడు మన మెగాస్టార్. సురేఖ గారితో కాదండోయ్..వేరే అమ్మాయితో.. వినడానికి షాకింగ్ గా ఉన్నా ఇదే నిజం. ఈ విషయాని ఆయనే స్వయంగా చెప్పుకొచ్చారు. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ తాజాగా నటిస్తున్నమూవీ ‘లాల్ సింగ్ చద్దా’. ఈ చిత్రంతోనే అక్కినేని కుర్రాడు నాగ చైతన్య బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఈ చిత్రం ఆగష్టు 11న పాన్ ఇండియా చిత్రంగా గ్రాండ్ రిలీజ్ కి రెడీ అయింది. ఇక్కడ మరో మంచి విషయం ఏమిటంటే తెలుగులో ఈ చిత్రానికి మెగాస్టార్ చిరంజీవి ప్రజెంట్ చేస్తున్నారు.

కాగా, ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా నాగార్జున ..చిరంజీవి, అమీర్ ఖాన్, నాగ చైతన్య ని తనదైన శైలిలో ఇంటర్వ్యూ చేశారు. లాల్ సింగ్ చద్దాప్రమోషన్స్ కోసం ఈ ఇంటర్వ్యూ నిర్వహించారు. ఒక్కే స్క్రీన్ పై నలుగురు బిగ్ స్టార్స్ కనిపిస్తే..ఎలా ఉంటుంది రచ్చ ర్చ్చే. అదే జరిగింది ఇంటర్వ్యుల్లో. దీనికి సంబంధించిన ప్రోని రిలీజ్ చేసారు మేకర్స్. ఆ ప్రోమో లో చిరు, నాగార్జున చాలా హ్యాపీగా నవ్వుకుంటూ మాట్లాడుతూ..పాత మెమోరీస్ ని గుర్తు చేసుకున్నారు. పెద్ద స్టార్స్ అనే ఫీలింగ్ లేకుండా..సరదాగా కబుర్లు చెప్పుకున్నారు. అంతేకాదు..ఈ క్రమంలోనే చిరంజీవి తన ఫస్ట్ లవ్ గురించి బయటపెట్టాడు. దీనికి నాగార్జున తెగ నవ్వుకున్నాడు.

లాల్ సింగ్ చద్దా మూవీలోని లవ్ స్టోరీ గురించి చర్చ వచ్చినప్పుడు..చిరుని ని ఫన్నీ గా ” మీరు ఫస్ట్ టైం .. ఎప్పుడు ప్రేమలో పడ్డారు సార్” అని అమీర్ ఖాన్ చిరంజీవిని అడగ్గా..చిరు నవ్వుతూ..సిగ్గుపడుతూ..” మొగల్తూరు నేను 7వ తరగతి చదువుతున్నప్పుడు ఓ అమ్మాయిని చూడగానే ప్రేమ పుట్టింది. ఆ రోజుల్లో అమాయిలు సైకిల్ తొక్కడం అంటే అదో పెద్ద వింత..ఓ గొప్ప విషయం. అందరు ఆశ్చర్యంగా చూసేవారు. ఇక అలాంటి టైంలో నాకు ఆ అమ్మాయి పట్టుకుని సపోర్ట్ ఇస్తే.. నేను ఎంచక్కా జాలీగా సైకిల్ తొక్కేవాడిని. అమ్మాయి ముందు చూసి సైకిల్ నేర్పిస్తుంటే..నేను ఆ అమ్మాయినే చూసేవాడిని..”అంటూ సరదాగా సిగ్గుపడుతూ చెప్పుకొచ్చాదు. దీంతీ నాగార్జున పడి పడి నవ్వుకున్నాడు. ప్రోమో నే ఈ రేంజ్ లో ఉంటే..ఇక ఫుల్ ఎపిసోడ్ ఎంత మజాగా ఉంటుందో..?

Share post:

Latest