గోరంట్ల భవిష్యత్ అప్పుడే తేలుతుందా?

మొత్తానికి వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్ వ్యవహారం ఓ కొలిక్కి వచ్చింది. అది అసలు వీడియో కాదని, అలాగని మార్ఫింగ్‌ చేశారనీ చెప్పలేమని, కానీ అసలు విషయం తేలాలంటే ఫస్టు రికార్డు చేసిన ఫోన్‌లోని వీడియో దొరకాలని, దానిని మాత్రమే పరీక్షకు పంపగలమని చెప్పి అనంతపురం ఎస్పీ…మాధవ్ స్టోరీకి శుభం కార్డు వేశారు. అయితే ఈ అంశంపై అనేక ప్రశ్నలు ఉత్పమన్నవుతున్నాయి. ఇప్పటికే దీనిపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్న విషయం తెల్సిందే.

ఎంపీని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు…అదే సమయంలో వైసీపీ నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వారి మాట్లాడి…ఆ వీడియో నిజమని తేలితే…కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇక దీనిపై హోమ్ మంత్రి వనిత మాట్లాడుతూ.. వీడియోను ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌కు పంపించామని, అసలు విషయం తేల్చేస్తామని అన్నారు. కానీ అనంతపురం ఎస్పీ…అసలు ల్యాబ్ కు పంపించలేదని, అలా పంపే అవకాశం లేదని, అసలు వీడియో దొరకలేదని, ఇప్పుడు ఉన్న వీడియో ఒరిజినల్ కాదని అన్నారు.

ఇక అసలు వీడియో కాదో తెలియాలంటే ఎంపీ ఫోన్ గాని, బాధిత మహిళ ఫోన్ సీజ్ చేసి పరీక్షిస్తే తేలిపోతుందిగా? అని పలువురు విలేఖర్లు ఎస్పీని ప్రశ్నించారు. ఏ ఫిర్యాదు లేకుండా తాము ఎంపీ ఫోన్ ఎలా సీజ్ చేస్తామని ఎస్పీ చెబుతున్నారు. ఏదేమైనా గాని ఈ న్యూడ్ వీడియో వ్యవహారంలో అనేక డౌట్లు ఉన్నాయి. కానీ చివరికి అసలు వీడియో లేదని చెప్పి..ఈ మ్యాటర్ క్లోజ్ చేశారని ప్రతిపక్షాలు మండిపడుతున్నారు.

ఇంతటితో కథ ముగించి ఎంపీని సేవ్ చేశారని అంటున్నారు. అయితే ఇప్పుడు ఎంపీని సేవ్ చేసిన…ప్రజా క్షేత్రంలో మాత్రం సేవ్ చేయలేరని ప్రతిపక్షాలు ఫైర్ అవుతున్నాయి. ఎన్నికల్లో మళ్ళీ మాధవ్ ని గాని ఎంపీగా నిలబడితే ప్రజలే మంచి తీర్పు ఇస్తారని అంటున్నారు. నెక్స్ట్ మాధవ్ ని ప్రజలే ఓడిస్తారని టీడీపీ శ్రేణులు అంటున్నాయి. చూడాలి మరి నెక్స్ట్ మాధవ్ విషయంలో ప్రజా తీర్పు ఎలా ఉంటుందో.

Share post:

Latest