మెగాస్టార్ కళ్యాణ్ రామ్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్.. కట్ చేస్తే..!

మెగాస్టార్ అనే పదం కేవలం ఒకరికి మాత్రమే పరిమితమయ్యే బిరుదు కాదు అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు మెగాస్టార్ అంటే ప్రేక్షకులను అలరిస్తూ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ వరస విజయాలతో దూసుకుపోయే వారికి ఈ బిరుదును అంకితం చేస్తారు. అందుకే మెగాస్టార్ చిరంజీవికి మెగాస్టార్ అనే బిరుదు వరించిన విషయం తెలిసిందే. ఆయన నటనలోనే కాదు ఎందులోనైనా సరే మెగాస్టార్ అనిపించుకుంటారు. చిరంజీవి తన సినీ కెరియర్ లో అప్పుడప్పుడు ఫెయిల్యూర్ చవిచూసినప్పటికీ.. తన సినిమా కథలతో సంబంధం లేకుండా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్ రాబడుతూ మొన్నటి వరకు మెగాస్టార్ గా కొనసాగారు. అయితే ఆయన ఎప్పటికీ మెగాస్టార్ చిరంజీవినే.. ఇకపోతే ఇటీవల ఆయన నటించిన ఆచార్య సినిమా పెద్దగా విజయాన్ని సొంతం చేసుకోలేకపోయింది అంతేకాదు డిస్ట్రిబ్యూటర్లు నిర్మాతలు కూడా అప్పుల పాలై రోడ్డున పడ్డారు.కంటెంట్ బాగుంటే ప్రేక్ష‌కులు ఆద‌రిస్తారు - మెగాస్టార్ చిరంజీవి - idhatri

కేవలం ఆచార్య సినిమా మాత్రమే కాదు ఎన్నో భారీ బడ్జెట్లో తెరకెక్కిన సినిమాలు కూడా ఘోర పరాజయాన్ని సొంతం చేసుకోవడం గమనార్హం. ఇక ఈ నేపథ్యంలోనే థియేటర్లకు ప్రేక్షకులు రాక డబ్బులు లేక నిర్మాతలు సైతం తాజాగా ఆగస్టు 1వ తేదీ నుంచి బందు నిర్వహించిన విషయం తెలిసిందే . కానీ ఆగస్టు 5వ తేదీన ఎట్టకేలకు బింబిసారా సినిమా విడుదలై మళ్లీ పూర్వవైభవాన్ని థియేటర్లకు అందించింది. కరోనా వచ్చినప్పటి నుంచి ఆర్ ఆర్ ఆర్ సినిమాను మినహాయిస్తే .. ఇప్పటివరకు ప్రేక్షకులు థియేటర్లకు సంతోషంగా వచ్చి సినిమాను చూసిన సందర్భాలు లేవు. కానీ బింబిసారా సినిమాకు ఎటువంటి ప్రమోషన్స్ పెద్దగా చేపట్టకపోయినా థియేటర్లన్నీ కళకళలాడుతూ ఉండడం చూసి నందమూరి అభిమానుల సైతం ఆశ్చర్యపోతున్నారు.Bimbisara : బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బింబిసార దూకుడు.. క‌ళ్యాణ్ రామ్  కెరియ‌ర్‌లోనే బెస్ట్ ఓపెనింగ్స్! | The News Qube

అంతేకాదు చాలా కాలం తర్వాత థియేటర్లలో ఈ జోరు ఉండడం చూసి నందమూరి కళ్యాణ్ రామ్ ను అందరూ మెగాస్టార్ అంటూ పొగిడేస్తున్నారు దీన్ని బట్టి చూస్తే మెగాస్టార్ చిరంజీవితో కళ్యాణ్ రామ్ ను పోల్చడం చాలా ఆనందంగా అనిపిస్తుంది. కానీ చిరంజీవి అభిమానులు మాత్రం కొంతవరకు నిరాశ వ్యక్తం చేస్తూ ఉండడం గమనార్హం. కానీ నందమూరి అభిమానులు మెగాస్టార్ చిరంజీవి రేంజ్కు తమ హీరో ఎదిగిపోయాడని హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి నందమూరి అభిమానులు ఇలా అనడానికి కూడా కారణం ఉంది.. ఎందుకంటే గత రెండు మూడు సంవత్సరాలుగా థియేటర్ లో సరైన కంటెంట్ లేక ప్రేక్షకులు లేక వెలవెల పోయాయి .

కానీ ఇన్ని రోజులకు మంచి కంటెంట్తో కళ్యాణ్ రామ్ మళ్లీ ప్రేక్షకుల ముందుకు రావడంతో థియేటర్లో కళకళలాడిపోతున్న నేపథ్యంలో థియేటర్లకు పూర్వ వైభవాన్ని అందించిన గొప్ప నటుడు అందుకే కళ్యాణ్ రామ్ ను మెగాస్టార్ అంటూ పొగుడుతున్నారు. ఇక కరెక్ట్ గా చూస్తే మెగా అభిమానులు కూడా ఇందులో ఫీల్ అవ్వాల్సిన విషయం ఏమీ లేదు. ఇకపోతే కళ్యాణ్ రామ్ ఈ సినిమాలో వన్ మ్యాన్ షో గా నటించారు అని చెప్పొచ్చు. కేథరిన్, సంయుక్త మీనన్ ఇద్దరు కూడా తమ నటనను కనబరిచారు. ఇక దర్శకుడు వశిష్ట ఎంతవరకు కష్టపడ్డారో తెలియదు కానీ సినిమా స్క్రిప్ట్ మాత్రం బ్లాక్ బస్టర్ అని చెప్పవచ్చు. అంతేకాదు రాబోయే రోజుల్లో ఇతర భాషలలో కూడా ఈ సినిమా విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Share post:

Latest