మళ్లీ ట్రోలర్స్ కి చిక్కిన మంచు లక్ష్మీ..ఈ సారి అలా..?

మోహన్ బాబు వారసురాలిగా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టిన మంచు లక్ష్మీ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఈమె ఎప్పటికప్పుడు తన మాటలతో ట్రోలర్స్ కి చిక్కుతూ నెటిజన్ ల చేతిలో ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఈ క్రమంలోని మళ్లీ తెలుగు రాదంటూ ట్రోలర్స్ చేతికి చిక్కి విపరీతంగా ట్రోల్స్ కి గురవుతోంది. ఇప్పటికే తెలుగు సినీ ఇండస్ట్రీకి ఎంతోమంది పరిచయమయ్యారు. కానీ అందరికీ కూడా తెలుగు వస్తుంది అంటే చెప్పలేము. కానీ కొంతమంది ప్రత్యేకంగా ట్యూటర్లను పెట్టుకొని మరీ తెలుగు నేర్చుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి. మరి కొంతమంది డబ్బింగ్ ఆర్టిస్టుల సహాయంతో తెలుగు సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు.

ఇకపోతే ఇత రాష్ట్రాల వారు తెలుగు మాట్లాడలేదు అంటే అందుకు ఒక అర్థం ఉంది . కానీ తెలుగు రాష్ట్రానికి చెందిన మంచు లక్ష్మి మాత్రం తెలుగు రాదని చెప్పడంతో సోషల్ మీడియాలో చాలామంది ఈమె పై వివిధ రకాల కామెంట్లతో పూర్తిగా ట్రోల్స్ చేస్తున్నారు. దీంతో ఈమె సోషల్ మీడియాలో ట్రోల్స్ అవుతూ ఉండడం గమనార్హం. ఇకపోతే అమెరికన్ యాసెంట్ తెలుగులో మాట్లాడుతూ అలా మాట్లాడడం కొంతమందికి నచ్చుతుంది.. మరి కొంతమందికి నచ్చదు అంటూ ఆమె వివరణ ఇచ్చింది.. అంతేకాదు తన భాష పై తానే సెటైర్ వేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఆమె మాట్లాడుతూ నేను పెరిగిన వాతావరణం వేరు.. సినిమా ఇండస్ట్రీ వాతావరణం వేరు అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఎవరు ఎన్ని విధాలుగా ట్రోల్ చేసినా వాటిని నేను ఆనందంగా స్వీకరిస్తాను అని ఆమె చెప్పింది.

మీరు మూవీస్ నుంచి తప్పుకోవడానికి గల కారణం ఏమిటి అని యాంకర్ అడిగిన ప్రశ్నకు మంచి లక్ష్మి మాట్లాడుతూ.. సినిమాల్లో ప్రొడ్యూస్ చేయకూడదని అనుకున్నాను. వెబ్ సిరీస్ మాత్రమే చేయాలని ..నాకు నచ్చినప్పుడు నేను చేయవచ్చు.. ఏమీ డేట్స్ ఉండవు. నా డేట్స్ నేను ఫిక్స్ చేసుకోవచ్చు ..మా పాపని కూడా చాలా బాగా చూసుకోవచ్చు. సమయం కూడా దొరుకుతుంది.. అందుకే సినిమాలకు దూరంగా ఉన్నాను అంటూ చెప్పుకొచ్చింది.

Share post:

Latest