త్రివిక్రమ్ తో సినిమాపై షాకింగ్ కామెంట్స్ చేసిన మహేష్ బాబు..!

ప్రముఖ దర్శకుడు పరశురాం దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన సర్కారు వారి పాట సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు మహేష్ బాబు. కానీ సినిమా స్క్రిప్ట్ ఇంకా పూర్తవని నేపథ్యంలో ఇన్ని రోజులు ఆలస్యం అవుతూ వచ్చింది. కానీ ఎట్టకేలకు నిన్న మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా త్రివిక్రమ్ తో సినిమాపై కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు మహేష్ బాబు ఇక వాటి గురించి మనం ఒకసారి చదివి తెలుసుకుందాం.Buzz: Mahesh Babu unhappy with Trivikram?తెలుగు చిత్ర పరిశ్రమలో త్రివిక్రమ్ శ్రీనివాస్ కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చిత్రాలకు పెట్టింది పేరుగా.. ఆయన సినిమా తీస్తున్నాడు అంటే కచ్చితంగా హిట్ అయ్యేటట్లు కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఇకపోతే ఎప్పుడూ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చిత్రాలను మాత్రమే కాకుండా అప్పుడప్పుడు డిఫరెంట్ జోనర్ లో కూడా ట్రై చేస్తూ సినిమాలను తెరకెక్కిస్తూ ఉంటారు . అలా వచ్చిన సినిమానే ఖలేజా. ఇక ఈ సినిమా థియేటర్లలో పెద్దగా ఆకట్టుకోకపోయినా బుల్లితెరపై మాత్రం మంచి టిఆర్పి రేటింగ్ సొంతం చేసుకుంటుంది. ఇక ఇప్పుడు మరొకసారి డిఫరెంట్ జోనర్ లో సినిమా చేయడానికి సిద్ధమయ్యారు త్రివిక్రమ్.

ఇక దాదాపు 12 సంవత్సరాల తర్వాత మళ్లీ వీరి కాంబినేషన్ రిపీట్ అవ్వబోతోంది. ఇప్పటికే పూజా కార్యక్రమం పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలోనే త్రివిక్రమ్ గురించి ఆయన డైరెక్షన్ గురించి మహేష్ బాబు మాట్లాడుతూ.. త్రివిక్రమ్ డైరెక్షన్ .. డైలాగ్స్ అంటే నాకు చాలా ఇష్టం చాలా కాలం తర్వాత మళ్లీ ఈ కాంబినేషన్ సెట్ అయింది ఆయనతో పనిచేయడానికి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. నాకోసం ఒక డిఫరెంట్ కథను రెడీ చేశాడు.. నేను కానీ.. త్రివిక్రమ్ కానీ ఇలాంటి సినిమా చేయలేదు.. మా సినిమా తప్పకుండా ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగా ఉంటుంది అంటూ మహేష్ బాబు తెలిపారు. దీంతో అభిమానులకి కూడా ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Share post:

Latest