మొదలైన ‘శ్రీరెడ్డి’ బాగోతం.. మొక్క‌లెందుకు బొక్క అంటోందా?

ఆ పేరు చెబితే టాలీవుడ్ ఉలిక్కి పడుతుంది. ఆ పేరు వింటే కొంతమంది నిర్మాతల గుండెల్లో గుబులు పుడుతుంది. అది మరెవ్వరోకాదు.. శ్రీ రెడ్డి. చేసిన సినిమాలు ఒకటి అరా అయినా ఫిలిం నగర్ నడిబొడ్డులో ఆమె చేసిన చేసిన రాద్ధాంతం అంతాఇంతా కాదు. అవును.. శ్రీరెడ్డి పేరు వింటే వివాదాలే గుర్తుకు వస్తాయి. దాదాపు కొన్ని నెలలపాటు తెలుగు మీడియాలు ఆమె వెంటే పడ్డాయి. అందుకే శ్రీరెడ్డిని తెలుగునాట అంత ఈజీగా ఎవరూ మర్చిపోలేరు. అయితే ఇప్పుడు యూట్యూబ్‌లో ఆమె వంట‌కాలు దర్శనమిస్తున్నాయి.

సినిమాల మాట అటకెక్కించి ఈ అమ్మడు ఓ యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తోంది. శ్రీరెడ్డికి డేరింగ్ చాలా ఎక్కువ. మాటలు చెప్పడం కాదు.. తరచూ చేతల్లో కూడా చూపిస్తుంటుంది. ఎంతోమంది ఇండస్ట్రీ, రాజకీయ ప్రముఖులకు నిద్రపట్టకుండా చేసిన శ్రీరెడ్డి.. ఫిల్మ్ ఛాంబర్ దగ్గర అర్ధనగ్న ప్రదర్శనతో ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయిన సంగతి విదితమే. పెద్ద చిన్న తేడా లేకుండా ఒక్కొక్కడికి చుక్కలు చూపించింది శ్రీరెడ్డి. అయితే ఇండస్ట్రీ ప్రముఖులతో పెట్టుకోవడంతో.. శ్రీరెడ్డికి సినిమాల్లో అవకాశం లేకుండా చేశారనే వాదన కూడా వుంది.

ఇక ఆ తంతంతా పక్కన బెడితే.. శ్రీరెడ్డి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్‌లో అసలు సిసలు నాటు వంటకాలను తన స్టైల్‌లో వండివార్చుతూ వీడియోలను చేస్తుందనే విషయం తెలిసినదే. ఒక‌వైపు వంట‌కాలు చేస్తూనే మ‌రోవైపు మొక్క‌ల గురించి హితోపదేశం చేస్తోంది అమ్మడు. ఇంట్లో ఎలాంటి మొక్క‌లు పెంచుకోవాలనే దానిపై శ్రీరెడ్డి ఓ వీడియోలో వివ‌రించింది. సాధార‌ణంగా మొక్క‌లు ఉద‌యం ఆక్సిజ‌న్ పీల్చుకొని రాత్రికి కార్బ‌న్ డై ఆక్సైడ్ వ‌ద‌లుతాయి. కాని ఇంట్లో పెంచుకోవ‌ల్సిన మొక్క‌లు రాత్రికి కూడా ఆక్సీజ‌న్ వ‌దిలే ఉండాలి అని చెబుతోంది.

Share post:

Latest