ఫ్లైట్‌లోనే రొమాన్స్ చేస్తున్న నయనతార – విఘ్నేష్ దంపతులు… వారికి ఇంకెక్కడా ప్లేస్ దొరకలేదా?

కొన్నేళ్లు ప్రేమాయణం సాగించిన నయనతార – విఘ్నేష్ లు ఇటీవలే అగ్నిసాక్షిగా ఒక్కటైన విషయం అందరికీ విదితమే. ఈ నేపథ్యంలో తాజాగా నయన్ – విఘ్నేష్ హాలీడే ట్రిప్‌లో భాగంగా బార్సీలోనాకు ప్రయాణం చేసారు. ఈ సందర్భంగా ఫ్లైట్‌లో తీసుకున్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అవుతున్నాయి. విఘ్నేష్ శివన్ జూన్ 9న తమిళనాడులోని మహాబలిపురంలో ఉన్న షెరటాన్ హోటల్లో పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసినదే. బీచ్ వ్యూ ఉండే ఈ హోటల్‌లో ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ పర్యవేక్షణలో పెళ్లిమండపం వర్క్ జరిగింది. దీంతో ఈ జంట పెళ్లి దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయిపోయింది.

ఇకపోతే వివాహం జరిగిన చాలా తక్కువ సమయంలోనే సినిమా పనుల్లో బిజీ అయిన నయనతార – విఘ్నేష్ శివన్.. ఖాళీ సమయాల్లో తమ వైవాహిక జీవితాన్ని గడపడానికే మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలోనే పర్వదినాలను కుటుంబ సమేతంగా చేసుకోవడం విశేషం. ఈ నేపథ్యంలో తాజాగా నయనతార.. విఘ్నేష్ శివన్ హాలీడే ట్రిప్‌లో భాగంగా బార్సీలోనాకు పయనం అయినట్టు తెలుస్తోంది.

ఇందులో భాగంగానే ఇప్పుడు వీళ్లిద్దరూ బార్సిలోనాకు పయనమైన విషయాన్ని సోషల్ మీడియా ఖాతాల ద్వారా చెప్పుకొచ్చారు. విఘ్నేష్ శివన్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటాడో అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగానే తాజాగా అతడు ఇన్‌స్టాగ్రామ్‌లో నయనతారతో కలిసి ప్లైట్‌లో బార్సీలోనా వెళ్తోన్న ఫొటోలను షేర్ చేశాడు. ఇందులో నయన్ అతడి మీద కూర్చుని ఉంది. మరో పిక్‌లో విఘ్నేష్ ఆమెకు ముద్దు పెట్టాడు. దీంతో ఈ ఫొటోలకు భారీ రెస్పాన్స్ వచ్చి తెగ వైరల్ అయిపోతోన్నాయి. సదరు ఫొటోస్ చూసిన నెటిజన్లు కొందరు రొమాన్స్ కి ఇంకెక్కడా చోటు దొరకలేదా? అని ఫన్నీ ప్రశ్నలు అడుగుతున్నారు.

Share post:

Latest