సమంత SSC మార్క్‌షీట్‌ని ఎపుడైనా చూశారా? గమ్మత్తుగా ఉంటుంది.. డూప్లికేట్ అంటున్నారు?

సమంత గురించి రోజుకి ఒక్కసారైనా ఎక్కడో ఒకచోట ఒక గమ్మత్తైన విషయం తెలుస్తోంది. అవును.. సామ్ 10వ తరగతి రిపోర్ట్ కార్డ్ తాజాగా ఇంటర్నెట్‌ని షేక్ చేస్తోంది. అదే విషయాన్ని ఆమె చాలా సంతోషంగా రీట్వీట్ కూడా చేశారు. సమంత విద్యాభ్యాసం చెన్నైలోని CSI సెయింట్ స్టీఫెన్స్ మెట్రిక్యులేషన్ స్కూల్‌లో జరిగింది. అప్పట్లో స్కూల్‌లో ఆమె టాపర్‌గా నిలిచింది. అదేవిధంగా ఇప్పుడు సినిమాల్లో కూడా ఆమె టాపర్‌గా నిలిచిందని సామ్ అభిమానులు తగ పొగిడేస్తున్నారు.

ఇక ఆ రిపోర్ట్ కార్డ్‌ని ఒకసారి పరిశీలిస్తే, ఆమెకి ఇంగ్లీష్ I లో 90 మార్కులు, ఇంగ్లీష్ II లో 74 మార్కులు సాధించినట్లు పేర్కొంది. గణితంలో, ఆమె ఖచ్చితమైన స్కోరు 100 మరియు ఫిజిక్స్‌లో 90 కంటే ఎక్కువ స్కోర్ చేసింది. అలాగే హిస్టరీ లో 91 మార్కులు సాధించింది. కానీ జాగ్రత్తగా గమనించినట్లయితే ఆ మార్క్ షీట్ లో ఉన్న మార్కులు చాలా వరకు తప్పుగా వేయబడినవి అని అర్థమవుతుంది. ఆ మార్క్ షీట్ లో 50 మార్కులు కు జరిగిన ఫిజిక్స్ ఎగ్జామ్ లో 95 మరియు బోటనీ లో 84 మార్కులు సమంతకు ఆమె టీచర్లు ఎలా వేశారో వాళ్ళకే తెలియాలని కొందరు ఆమెని ట్రోల్స్ చేస్తున్నారు.

అసలు ఆ మార్కుల లిస్ట్ ఒరిజినల్ అవునా కాదో అని ప్రశ్నిస్తున్నారు. పోనీ ఇది సమంత ను డిఫేం చేయడానికి ఎవరో రిలీజ్ చేసిన ఫేక్ మార్క్ షీట్ అనుకుందామనుకున్నా దానికి ఆస్కారం లేదు ఎందుకంటే… సమంత స్వయంగా తన ఇంస్టాగ్రామ్ లో దీని గురించి మెన్షన్ చేయడం కొసమెరుపు. ఈ విషయం ఐడెంటిఫై చేసి కొందరు నెటిజన్స్ 50 కి 84 ఎలా వచ్చాయి అంటూ మీమ్స్ చేసి సోషల్ మీడియా లో వైరల్ చేస్తున్నారు. గమనించదగ్గ మరో విషయం ఏమిటంటే, సమంత కేరళ స్టూడెంట్ కానీ ఆమె మార్క్ షీట్‌లో తమిళ లాంగ్వేజ్ ఉంది. అదికాక మార్క్ షీట్ లో ఇచ్చిన ఇయర్ ప్రకారం సమంత 14 ఇయర్స్ కే టెన్త్ పాస్ అయినట్లు తెలుస్తోంది, ఇది ఎలా సాధ్యం అంటూ కొందరు నటిజెన్లు కామెంట్ చేశారు.

Share post:

Latest