ఈసారి సంక్రాంతి బరిలో పందేనికి దిగనున్న నందమూరి బాలకృష్ణ!

బాలయ్య కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక మాస్ సినిమా రూపొందుతోందన్న విషయం అభిమానులకు తెలిసిందే. బాలకృష్ణ 107వ చిత్రమిది. ఇంకా టైటిల్ కన్ఫర్మ్ చేయకపోవడంతో వర్కింగ్ టైటిల్ NBK107 అని ఫిల్మ్ యూనిట్ ఖరారు చేసింది. ఇందులో అందాల తార శ్రుతీ హాసన్ కథానాయికగా నటిస్తున్నారు. దీనినుండి లేటెస్ట్ అప్‌డేట్‌ ఏంటంటే… సంక్రాంతి బరిలో బాలకృష్ణ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయట. తొలుత ఈ ఏడాది విజయదశమికి విడుదల చేయాలని భావించినా… సంక్రాంతి అయితే బెస్ట్ అని బాలయ్య ఫీల్ అవుతున్నాడట.

అయితే ఆల్రెడీ సంక్రాంతి బరిలో 2 సినిమాలు ఉన్నాయి. ఒకటి… మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజ రవితేజ ముఖ్యమైన పాత్రలో దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్న సినిమా రూపొందుతోంది. దీనికి ‘వాల్తేరు వీరయ్య’ అనే టైటిల్ ఖరారు చేసినట్లు సమాచారం. సంక్రాంతికి విడుదల అన్నారు కానీ… ఇంకా డేట్ అనౌన్స్ చేయలేదు. ఇక రెండవది యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, రామాయణం ఆధారంగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ రూపొందిస్తున్న ‘ఆదిపురుష్’. జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ రెండు సినిమాలకు తోడు ఇప్పుడు మరో సినిమా వచ్చి చేరింది.

అయితే… చిరంజీవి సినిమా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని గుసగుసలు వినబడుతున్నాయి. బాలకృష్ణ సినిమా సంక్రాంతికి వస్తే… చిరంజీవి సినిమా వెనక్కి వెళ్లే అవకాశాలు ఉన్నాయనేది ఫిల్మ్ నగర్ టాక్. ఎందుకంటే… రెండు సినిమాలూ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలో రూపొందుతున్నాయి. కాబట్టి బాక్సాఫీస్ బరిలో 2 సినిమాలను ఒకేసారి విడుదల చేయడానికి నిర్మాతలు రెడీగా లేరని భోగట్టా. అందువలన ముందు బాలయ్య సినిమా ముందు రిలీజ్ చేసి తరువాత మెగా154 సినిమాని రిలీజ్ చేయబోతారని వినికిడి.

Share post:

Latest