స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పెళ్ళామంటే ఆమాత్రం స్టైల్ ఉండాలి మరి… షేక్ అవుతున్న ఫోటో!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స్టైల్ గురించి చెప్పేదేముంది. ముందునుండి అందరూ చూస్తున్నారు. అయితే అతని భార్య స్నేహారెడ్డి గురించి ఎంతమందికి తెలుసు? ఆమె ఓ సాధారణ గృహిణి అయినప్పటికీ సెలిబ్రిటీలకు ఏమాత్రం తీసిపోని రీతిగా ఉంటుంది. ఎంతైనా స్టైలిష్ స్టార్ భార్య అంటే ఏమాత్రం ఉండాలి అంటున్నారు మన అల్లు వారి ఫ్యాన్స్. అవును.. ఆమె తాజాగా షేడెడ్ కలర్ చీర, కాంబినేషన్ డిజైనర్ బ్లౌజ్.. చెవికి క్రిస్టలైన్ జూకా ధరించి ఎంతో ఇస్మార్ట్ గా కనిపిస్తున్నరు. ఇంకా చెప్పాలంటే సూపర్ మోడల్ ని తలపిస్తున్నారు.

ఇటీవల కాలంలో అమ్మడు సోషల్ మీడియాల్లో మంచి యాక్టివ్ గా ఉంటోంది. నిరంతరం తమ కుటుంబ వేడుకల ఫోటోలు వీడియోతో పాటు వ్యక్తిగత ఫోటోషూట్లను కూడా షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటోంది. కాగా స్నేహా తాజా ఫోటోషూట్ నుండి కొన్ని ఫోటోలను షేర్ చేయగా అవి కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వీటిలో సూపర్ మోడల్ లాగా మనోహరంగా కనిపిస్తోందంటూ అభిమానులు కాంప్లిమెంట్లు ఇచ్చేస్తున్నారు. సమంతకు ఎంతో ఇష్టమైన స్టైలిస్ట్ ప్రీతమ్ జుకల్కర్ ఈ లుక్ ని డిజైన్ చేయడం కొసమెరుపు.

ముఖ్యంగా భుజంపై పాకి ఉన్న ఆ నక్షత్ర చేప ఆ జాకెట్ కె అందం తెచ్చింది. కాదు కాదు.. స్నేహ అందం రెట్టింపు చేసింది. నెటిజన్లు ముఖ్యంగా ప్రీతమ్ కి హ్యాట్సాఫ్ చెబుతున్నారు. ఈ ఫోటోలను చూసి అభిమానులు ఆమెను ‘స్టైలిష్ స్టార్ రాణి’ అని పిలుస్తున్నారు. కాగా ఇన్ స్టాగ్రామ్ లో స్నేహను 80 లక్షల మంది అభిమానులు ఫాలో కావడం విశేషం. బాలీవుడ్ లో మీరా రాజ్ పుత్.. టాలీవుడ్ లో స్నేహారెడ్డి అంటూ ఫ్యాన్స్ ప్రతిసారీ కాంప్లిమెంట్లు ఇస్తూనే ఉన్నారు. షాహిద్ కపూర్ – మీరా రాజ్పుత్ జంట అన్యోన్యత లానే అల్లు అర్జున్ – స్నేహా అన్యోన్యత పైనా ప్రతిసారీ అభిమానులు ప్రశంసలు కురిపిస్తుంటారు.

Share post:

Latest