తెలుగు సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు ఎవరో తెలుసా?

తెలుగు సినిమాలు ఓ మూసధోరణిలో పోతున్నవేళ, అడపాదడపా కొన్ని సినిమాలు వచ్చి ప్రేక్షకుల మైండ్ సెట్ ని మర్చి వేసాయి. ఇక అలాంటి సినిమాలు కొన్ని సూపర్ హిట్లయితే మరికొన్ని సినిమాలు మాత్రం బక్షాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. ప్లాపయినప్పటికీ ఆయా సినిమాలు మాత్రం ప్రేక్షక గుండెల్లో పదిలంగా ఉండిపోయాయి. ఆ సినిమాలలో ముఖ్యమైన అంశం ఏమిటంటే క్లైమాక్స్ లో హీరో ప్రాణాలు కోల్పోతాడు. ఇది ఆడియన్స్ జీర్ణించుకోలేని విషయం అయినప్పటికీ ఆయా పాత్రలు పోషించిన హీరోలు మాత్రం ప్రత్యేకంగా నిలిచారు. ఇపుడు అలాంటి హీరోలు గురించి లుక్కేద్దాం రండి.

శోభన్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ‘బాబీ’ అనే చిత్రం చేశాడు. ఈ మూవీలో మహేష్ బాబు పాత్ర చనిపోతుంది. అలాగే హీరోయిన్ ఆర్తి అగర్వాల్ పాత్ర కూడా చనిపోతుంది. ఈ సినిమా రిజల్ట్ మాత్రం ప్లాప్ అయింది. అలాగే విజయేంద్ర ప్రసాద్ తెరెకెక్కించిన ‘రాజన్న’ చిత్రంలో నాగార్జున పాత్ర చనిపోతుంది. ఇక కృష్ణవంశీ – ప్రభాస్ కాంబోలో వచ్చిన ‘చక్రం’ సినిమాలో ప్రభాస్ పాత్ర చనిపోతుంది. ఈ సినిమా కూడా ప్లాప్ అయ్యింది. కానీ ఇప్పటికీ ఆ సినిమాకు ప్రేక్షకులు వున్నారు. బాహుబలి 2 లో కూడా ప్రభాస్ పాత్ర చనిపోతుంది కానీ డ్యూయల్ రోల్ కాబట్టి వర్కౌట్ అయిపోయింది.

అలాగే జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘ఆంధ్రావాలా’ ‘జై లవ కుశ’ ‘యమదొంగ’ చిత్రాల్లో ఎన్టీఆర్ పోషించిన పాత్రలు చనిపోతాయి. ఆ సినిమాల రిజల్ట్ గురించి తెలిసినదే. ‘భీమిలి కబడ్డీ జట్టు’ ‘ఈగ’ ‘జెర్సీ’ ‘జెంటిల్ మన్’ ‘శ్యామ్ సింగ రాయ్’లో నాని పాత్రలు చనిపోతాయి.

ఆ సినిమాల మార్క్ తెలిసినదే. హీరో రానా నటించిన ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రంలో కూడా రానా పాత్ర చనిపోతుంది. ‘నక్షత్రం’ ‘రిపబ్లిక్’ వంటి సినిమాల్లో సాయి తేజ్ పాత్రలు చనిపోతాయి. అలాగే ‘వేదం’ సినిమాలో అల్లు అర్జున్, మనోజ్ పాత్ర కూడా చనిపోతుంది. కంచె’ చిత్రంలో వరుణ్ తేజ్ పాత్ర చనిపోతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ పెరుగుతుంది. అయితే ఆయా సినిమాలు మాత్రం స్పెషల్ గా నిలిచిపోయాయి.