మీటూ ఉద్యమం కంటిన్యూ అవుతుందా? ఆఫర్ ఇస్తానని అక్కడ టచ్ చేశాడంటున్న హీరోయిన్?

సినిమా ఇండస్ట్రీలో గత కొన్నాళ్లుగా ‘కాస్టింగ్ కౌచ్’ ‘మీటూ ఉద్యమం’ అనే పదాలు ఎక్కువగా ట్రెండ్ అయ్యాయి. అప్పట్లో ఈ కాస్టింగ్ కౌచ్ ఉన్నా కూడా అది కేవలం నాలుగు గోడలమధ్యే గుట్టు చప్పుడు కాకుండా జరిగిపోయేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. చాలా మంది నూతన నటీమణులు ధైర్యంగా తమకు ఎదురైన చేదు అనుభవాల గురించి మీడియా ముందు నిర్భయంగా చెబుతున్నారు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్స్ గా రాణించిన వారు కూడా తమ సినీ కెరియర్ ముగిసాక ఇప్పుడు చాలా ఇంటర్వ్యూలలో పాల్గొని వారిని ఇబ్బందులకు గురి చేసిన వారి మీద షాకింగ్ కామెంట్స్ చేయడం గమనార్హం.

అవును, ఇపుడు మీటు అనే ఉద్యమం పేరుతో తమకు జరిగిన అన్యాయాలమీద విరుచుకుపడుతున్నారు. రాధిక ఆప్టే వంటి బోల్డ్ హీరోయిన్ నుంచి విద్యాబాలన్ లాంటి క్రేజీ హీరోయిన్ వరకు, అలాగే కంగనా రనౌత్ వంటి ఫైర్ బ్రాండ్ హీరోయిన్ నుంచి సింగర్ చిన్మయి వరకు ఇలా చిన్నాచితక హీరోయిన్లు కూడా తమకు ఎదురైన చేదు అనుభవాలను లైంగిక వేధింపులను చెప్పుకొస్తున్నారు. దాంతో సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేది ఒక పెద్ద ఉద్యమంలాగా తయారైంది.

ఈ క్రమంలో తాజాగా రవితేజ హీరోగా వచ్చిన ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసిన అన్వేషి జైన్ కూడా తనకు ఇండస్ట్రీలో ఎదురైన ఓ భయంకరమైన అనుభవం గురించి మీడియా ముందు పెదవి విప్పింది. ఆమె సినిమా ఇండస్ట్రీ లోకి కొత్తగా అడుగుపెట్టినప్పుడు సినిమా ఆఫర్స్ కోసం కొందరు దర్శక నిర్మాతల దగ్గరికి వెళితే వాళ్లు చాలా అసభ్యంగా కామెంట్లు చేసేవారట. ఈ క్రమంలో ఒక స్టార్ డైరెక్టర్ మాత్రం సినిమా ఆఫర్ ఇస్తానని ఆమెకి రమ్మని చెప్పి తీరా అక్కడికి వెళ్ళాక ఆమె బాడీ పై అసభ్యకరంగా టచ్ చేయడంతో పాటు నాతో చాలా అసభ్యంగా ప్రవర్తించాడట. దాంతో విషయం అర్థమై అక్కడి నుంచి వెళ్ళిపోయాను అంటూ అన్వేషి జైన్ తనకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి చెప్పుకుంటూ కన్నీటి పర్యంతమైంది.

Share post:

Latest