సీనియర్ హీరోయిన్ జయప్రద భర్త కూడా ఒక హీరోనే… ఎక్కడో తెలుసా?

అలనాటి మేటి నటి జయప్రద గురించి అందరికీ తెలిసే ఉంటుంది. అభినయంతో పాటు చక్కటి అందం ఆమె సొంతం. తనకున్న అద్భుతమైన స్టార్ డంతో హీరోయిన్ నుండి పొలిటీషియన్ వరకు ఎదిగిన వాళ్లలో మనకు ముందుగా గుర్తుకు వచ్చేది జయప్రద పేరు. అవును… ఈమె తండ్రి ఫైనాన్షియల్ కావడంతో 13 ఏళ్ళ వయసులోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా ‘భూమికోసం’ అనే సినిమాతో సినీ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో నటించినందుకు ఆమె అప్పట్లో పది రూపాయల రెమ్యూనరేషన్ ను అందుకుంది. కట్ చేస్తే.. 17 ఏళ్ల వయసు వచ్చేసరికి పెద్ద స్టార్ హీరోయిన్ అయి కూర్చుంది.

K. బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన ‘అంతులేని కథ’తో జయప్రద అంతులేని పేరుని సంపాదించుకుంది. ఇక ఆ సినిమా తర్వాత ఆమె వెనక్కి తిరిగి చూడాల్సిన పనిలేకుండా పోయింది. ఈ క్రమంలో ANR, NTR, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు వంటి స్టార్ హీరోల సరసన నటించి 1970-80లలో సినిమా ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసింది జయప్రద. అంతేకాకుండా ఆ తరువాతి కాలంలో మెగాస్టార్ చిరంజీవి సరసన కూడా నటించి మెప్పించింది. అయితే ఆమె కెరియర్ పీక్స్ లో ఉన్న టైంలో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. బాలీవుడ్లో కూడా అందరు స్టార్ హీరోలతో నటించింది.

తెలుగు, హిందీ లోనే కాకుండా తమిళ్, మలయాళం ఇలా అన్ని భాషల్లో నటించిన జయప్రద అందరు స్టార్ హీరోలతో నటించింది. అలా కెరీర్ పీక్స్ లో ఉన్న టైంలో శ్రీకాంత్ మెహతా అనే వ్యక్తిని పెళ్లాడింది. అయితే ఈమె పెళ్లి చేసుకున్న శ్రీకాంత్ మెహతా గురించి చాలా తక్కువమందికి తెలుసు. శ్రీకాంత్ మెహతా కూడా సినీ నటుడే. జయప్రద తో కలిసి శ్రీకాంత్ మెహతా హిందీ సినిమాల్లో నటించాడు. అంతేకాదు నిర్మాతగా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో హిట్ సినిమాలు అందించారు. విచిత్రం ఏమిటంటే ప్రేమ గుడ్డిది అన్నట్లు పెళ్ళై ముగ్గురు పిల్లలు ఉన్న తండ్రిని పెళ్లాడింది జయప్రద. ఆయన తన మొదటి భార్య కు కూడా విడాకులు ఇవ్వకుండానే జయప్రద అతన్ని పెళ్లి చేసుకోవడం ఒకింత చోద్యమనే చెప్పుకోవాలి.

Share post:

Latest