విచిత్ర విధి: ఆ నటుడు చనిపోయిన తరువాతే ఆ ఇంటి అల్లుడని ప్రపంచానికి తెలిసింది?

అవును. మనచుట్టూ అనేక విషయాలు జరుగుతూ ఉంటాయి. మనం వాటిని ఫలానా అని గుర్తించలేము. కానీ అవి మననుండి దూరం అయినపుడు మాత్రం అనేక విషయాలు బయటకు వస్తాయి. అలాంటప్పుడు అవునా? అని అవాక్కవుతాము. మనషుల విషయంలో ఇలాంటివి జరిగినపుడు ఒకింత ఆశ్చర్యానికి, ఉద్వేగానికి లోనవుతాము. ముఖ్యంగా సినిమా వారి జీవితాలకు సంబంధించి ఏ విషయం బయటకు వచ్చినా గమ్మత్తుగా ఉంటుంది. వెండి తెరపైన అభిమానులను అలరించిన వారు వ్యక్తిగత జీవితానికి వచ్చినపుడు మాత్రం కాస్త గోప్యతను మెంటైన్ చేస్తారు.

అయితే ప్రస్తుతం వున్న సోషల్ మీడియా ప్రపంచంలో ఎలాంటి విషయం అయినా యిట్టె బయటపడిపోతుంది. అటువంటి జీవితానికి సంబంధించి హీరో “చరణ్ రెడ్డి” జీవితం దగ్గరగా ఉంటుందని చెప్పవచ్చు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం అనే గ్రామానికి చెందిన వారు చరణ్ రెడ్డి. 2001లో రామోజీరావుకి సంబంధించి ఉషా కిరణ్ మూవీస్ లో “ఇష్టం” అనే సినిమా ద్వారా వెండితెరకు హీరోగా పరిచయం అయ్యారు. అంతేకాకుండా ఈ సినిమా డైరెక్టర్ విక్రమ్ కే కుమార్ కూడా మొదటిసారి తెలుగు తెరకు పరిచయం కావడం విశేషం.

ఇష్టం సినిమా సరిగ్గా ఆడకపోవడంతో హీరో చరణ్ రెడ్డి సినిమాలకు అక్కడితోనే ఫుల్ స్టాప్ పెట్టేసాడు. తర్వాత అక్కినేని నాగేశ్వరరావు మనవరాలు హీరో సుమంత్ సోదరి అయిన సుప్రియను ప్రేమించి వివాహం చేసుకున్నారు. సుప్రియ పవన్ కళ్యాణ్ నటించిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అనే సినిమాలో నటించిన విషయం విదితమే. ఆ తర్వాత హీరోయిన్ గా నటించడం మానేసిన సుప్రియ అన్నపూర్ణ స్టూడియోలో సినిమాకు సంబంధించి అన్ని వ్యవహారాలను ఆమె దగ్గరుండి చూసుకోవడం మొదలు పెట్టింది. అయితే దురదృష్టవశాత్తు చరణ్ రెడ్డి తన 36వ యేటనే మరణించారు. అయితే ఆయన మరణించే సంవత్సరం తన భార్య సుప్రియతో విడాకులు కోసం కోర్టును ఆశ్రయించడం గమనార్హం.