హీరో ధనుష్ తాజా సమాచారమిదే… తమ్ముడిపాలిట విలన్ గా మారుతున్న అన్న?

తమిళ తంబీల అభిమాన నటుడు ధనుష్ గురించి అందరికీ తెలిసినదే. ఇక ధనుష్ కి తన అన్న అయినటువంటి దర్శకుడు సెల్వ రాఘవన్ కి మధ్య గల అనుబంధం గురించి ఇక్కడ ప్రత్యేకించి ప్రస్తావించాల్సిన పనిలేదు. ఇక పోతే అలాంటి వీరి బంధంలో చిచ్చు రేగింది. అవును…. తమ్ముడికి అన్నయ్యకి పడటం లేదట. ఆగండాగండి.. ఇక్కడే వుంది అసలు ట్విస్ట్… బయట కాదండి, ధనుష్ నటించిన ఓ సినిమాలో సెల్వ రాఘవన్ విలన్‌గా నటించబోతున్నాడట. అలాంటి చిత్రం త్వరలో తెరపైకి రావడానికి రెడీ అవుతోంది.

ఇకపోతే ధనుష్‌ చాలాకాలం తరువాత ఇటీవల విడుదలైన ‘తిరుచిట్రంఫలం’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు అని చెప్పుకోవాలి. కాగా ప్రస్తుతం ‘నానే వరువేన్‌’ చిత్రంలో నటిస్తున్నారు. దీనికి ఆయన సోదరుడు సెల్వరాఘవన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. విశేషం ఏమిటంటే ఈ చిత్రంలో ధనుష్‌కు ప్రతినాయకుడిగా ఈయనే నటిస్తున్నట్లు కోలీవుడ్ విశ్వసనీయవర్గాల సమాచారం. దర్శకుడుగా మంచి పేరు ఉన్న సెల్వరాఘవన్‌ ఇటీవల నటుడుగాను దుమ్మురేపుతున్నారు. ‘సాని కాగితం’ చిత్రంతో నటుడిగా పరిచయమైన ఈయన ఆ చిత్రంలో సెటిల్‌ ఫెర్మార్మెన్స్‌తో అందరి ప్రశంసలను అందుకున్నారు.

అలాగే ఇటీవల విజయ్‌ కథానాయకుడుగా నటించిన బీస్ట్‌ చిత్రంలో కూడా ఓ ముఖ్య పాత్రను పోషించిన సంగతి విదితమే. ప్రస్తుతం ధనుష్‌ హీరోగా నటిస్తున్న నానే వరువేన్‌ చిత్రంపై దృష్టి సారించారు. ఇంతకు ముందు వీరి కాంబినేషన్‌లో కాదల్‌ కొండేన్, పుదుపేట్టై, మయక్కం ఎన్నా చిత్రాలు రూపొందాయి. వాటిలో కాదల్‌ కొండేన్, పుదుపేట్టై చిత్రాలు సంచలన విజయం సాధించాయి. కాగా సుమారు 11 ఏళ్ల తరువాత మళ్లీ వీరి కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం నానే వరువేన్‌. దీనిని కలైపులి ఎస్‌.థాను నిర్మిస్తున్నారు.

Share post:

Latest